యూపీలో ఎన్‌కౌంటర్‌: ముగ్గురు క్రిమినల్స్ హతం, వికాస్ దూబే పరారీ

By narsimha lodeFirst Published Jul 3, 2020, 10:59 AM IST
Highlights

ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు శుక్రవారంనాడు ఉదయం జరిపిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు క్రిమినల్స్ మరణించారు. 

న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు శుక్రవారంనాడు ఉదయం జరిపిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు క్రిమినల్స్ మరణించారు. ఈ ముగ్గురు కూడ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేకు చెందినవారుగా పోలీసులు చెబుతున్నారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశం నుండి వికాస్ దూబే తప్పించుకొన్నట్టుగా పోలీసులు తెలిపారు.

గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు చుట్టుముట్టిన  సమయంలో దూబే గ్యాంగ్ జరిపిన కాల్పుల్లో కాన్పూర్  డిప్యూటీ సూపరింటెండ్ హోదా కలిగిన సీనియర్ పోలీసు అధికారి సహా నలుగురు కానిస్టేబుళ్లతో పాటు ఎనిమిది మంది పోలీసులు మరణించారు.

ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు, ఓ పౌరుడు కూడ గాయపడిన విషయం తెలిసిందే.వికాస్ దూబేను పట్టుకొనేందుకు బితూర్ లోని డిక్రూ గ్రామానికి పోలీసులు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. దూబేపై 60 కేసులు రిజిష్టర్ అయ్యాయి. 

వికాస్ దూబే ఉన్న భవనం వద్దకు పోలీసులు చేరుకొంటున్న సమయంలోనే అతని మనుషులు పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పోలీసులు మృతి చెందారు. 

పోలీసులు తమ వద్దకు రాకుండా ఉండేందుకు గాను నిందితులు రోడ్డుపై జేసీబీ వాహనాన్ని అడ్డంగా నిలిపారు. పోలీసులపై కాల్పులు జరిపిన తర్వాత నిందితులు అడవిలోకి పారిపోయారు.

also read:నేర చరిత్ర చాలా పెద్దదే: ఎవరీ గ్యాంగస్టర్ వికాస్ దూబే?

దూబే మనుషుులు జరిపిన దాడిలో ఒక డిఎస్పీ, ముగ్గురు సబ్ ఇన్స్ పెక్టర్లు, 4 కానిస్టేబుళ్లు ఉన్నారు. మిగిలిన నలుగురు పోలీసుల పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలిపారు.నిందితుల కోసం పోలీసులు ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొన్నారు. కాన్పూరు సరిహద్దులు మూసివేశారు.

నిందితులు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది పోలీసులు మరణించడంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డీజీపీని ఆదేశించారు. అంతేకాదు ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని కోరారు. 

ఈ ఘటనపై సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడ సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా పోలీసులకు సంతాపం తెలిపారు. 

వికాస్ దూబేపై పోలీసులు రూ. 25వేల రివార్డును ప్రకటించారు. గతంలో ఆయన జిల్లా పంచాయితీ మెంబర్ గా కూడ పనిచేశారు. 

click me!