విషవాయువు ఎఫెక్ట్.. ఒకే ఇంట్లో మహిళ సహా నలుగురు చిన్నారులు మృతి..

By SumaBala BukkaFirst Published Jan 20, 2022, 2:02 PM IST
Highlights

సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా.. మహిళ సహా ముగ్గురు చిన్నారులు మృతి చెందారని, ఓ పాపను ఆసుపత్రికి తరలించినప్పటికీ కాపాడలేకపోయామన్నారు. ప్రాథమిక విచారణలో ఎలాంటి వెలుతరు లేని గదిలో ఉన్న స్టవ్ నుంచి వచ్చిన విషవాయులు ద్వారానే ఊపిరాడక చనిపోయారని తేలిందని చెప్పారు.

ఢిల్లీ : ఢిల్లీలోని షాహ్ దారా జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. సీమాపురి ప్రాంతంలోని ఓ ఇంట్లో stove నుంచి వెలువడిన Poison gas పీల్చి నలుగురు పిల్లలు సహా తల్లి death చెందటం కలకలం రేపింది. పాత సీమాపూర్ లోని ఓ భవనంలో ఉన్న ఐదో అంతస్తులో ఐదుగురు Unconsciousnessలో పడి ఉన్నారని బుధవారం మధ్యాహ్రం 1.30 గంటలకు ఫోన్ వచ్చిందని పోలీసులు తెలిపారు.

సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా.. మహిళ సహా ముగ్గురు చిన్నారులు మృతి చెందారని, ఓ పాపను ఆసుపత్రికి తరలించినప్పటికీ కాపాడలేకపోయామన్నారు. ప్రాథమిక విచారణలో ఎలాంటి వెలుతరు లేని గదిలో ఉన్న స్టవ్ నుంచి వచ్చిన విషవాయులు ద్వారానే ఊపిరాడక చనిపోయారని తేలిందని చెప్పారు. కాగా ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అందర్నీ విషాదంలో ముంచేసింది. 

ఇలాంటి దుర్ఘటనే గత సెప్టెంబర్ లో హర్యానాలో చోటుచేసుకుంది. బోర్‌వెల్ క్లీన్ చేయడానికి దిగి.. అందులోని విషవాయువులు పీల్చి నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ముందుగా ఓ వ్యక్తి బోరుబావిలోకి దిగాడు. అతడికి ఊపిరాడలేదు.. విషవాయువులతో శ్వాస అందక లోపలే చనిపోయాడు. ఇది గమనించి.. అతన్ని బయటికి తీసుకురావడానికి వెళ్లిన మరో ముగ్గురు వ్యక్తులూ అదే తరహాలో ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణం హర్యానా నూహ్ జిల్లాలోని నిమ్కా గ్రామంలో చోటుచేసుకుంది.

హనీఫ్ పంటపొలంలోని బోర్‌వెల్‌ నుంచి కొంతకాలంగా దుర్వాసన వస్తోంది. అదేమిటో తేల్చుకోలేక.. బోరుబావిని క్లీన్ చేయించాలనుకున్నాడు. దీనికోసం నలుగురు కూలీలు జంషెడ్, షహీద్, జకీర్, యహాయలను మాట్లాడాడు. ముందు జంషెడ్ బోరుబావిలోకి దిగాడు. దిగీ దిగగానే ఆయన శ్వాస అందక అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఎంత పిలిచినా పలకకపోవడంతో పైన ఉన్నవారికి అనుమానం వచ్చింది. 

జంషెడ్‌ను బయటకు తేవడానికి షహీద్, జకీర్, యహాయలు ఒకరివెనుక ఒకరు బోరుబావిలోకి దిగారు. వెళ్లినవారు వెళ్లినట్టుగానే అపస్మారకస్థితిలోకి వెళ్లారు. వారిని బయటకు తీయడానికి హనీఫ్ తీవ్ర ప్రయత్నం చేశాడు. కానీ, విఫలమయ్యాడు. దీంతో చుట్టుపక్కల పంటచేనులో పనిచేస్తున్నవారిని పిలుచుకువచ్చాడు. ఆ రైతులూ అక్కడికి చేరగానే హనీఫ్ కూడా అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే రైతులు వారిని సివిల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.

ప్రస్తుతం హనీఫ్‌కు చికిత్స అందిస్తున్నారు. కాగా, జంషెడ్, షహీద్, జకీర్, యహాయలు అప్పటికే మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. ఈ నలుగురి మృతదేహాలకు పోస్టు మార్టం నిర్వహించాల్సి ఉన్నదని, ఆ తర్వాత వాటిని వారి కుటుంబాలకు అప్పగిస్తామని బిజోర్ స్టేషనర్ హౌజ్ ఆఫీసర్ అజవీర్ సింగ్ తెలిపారు.

ఘటనాస్థలి దగ్గర వాతావరణమంతా గందరగోళంగా మారిందని ఓ గ్రామస్తుడు చెప్పాడు. ఒకరివెంట ఒకరు నలుగురు అపస్మారక స్థితిలోకి వెళ్లడం.. అక్కడి నుంచి దుర్వాసన వస్తుండడంతో బోరుబావి దగ్గరకు చేరడానికి రైతులు తటపటాయించారని వివరించారు. వారంతా బోరుబావికి ఆలస్యంగా వెళ్లడంతో జరగాల్సిన ముప్పు జరిగిపోయిందని అన్నారు.

click me!