చైనా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్..   జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం నమూనాల పంపిణీ.. 

By Rajesh KarampooriFirst Published Dec 26, 2022, 4:14 AM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో కరోనా కలకలం చేలారేగింది. ఇటీవల చైనా నుండి తిరిగి వచ్చిన వ్యక్తికి కోవిడ్ సోకినట్లు తెలిసింది. దీంతో పాలనా యంత్రాంగం అప్రమత్తమైంది. ఆరోగ్య శాఖ  అతని నమూనాను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపింది. దాని రిపోర్టు వచ్చిన తర్వాతే ఆ వ్యక్తిలో కోవిడ్-19 ఏ వేరియంట్ ఉందో తెలుస్తుంది

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో కరోనా కలకలం చేలారేగింది. రాష్ట్రంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. కోవిడ్ లక్షణాలు ఉండటంతో ఓ వ్యక్తి ప్రైవేట్ పాథాలజీలో పరీక్ష చేయించుకున్నాడు. దీంతో కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే.. ఈ యువకుడు రెండు రోజుల క్రితమే చైనా నుంచి తిరిగి వచ్చినట్లు సమాచారం. ఇప్పుడు పరీక్ష నివేదిక వచ్చిన తర్వాత.. వ్యాధి సోకిన వ్యక్తి నమూనాను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు..

వివరాల్లోకెళ్లే... కరోనా సోకిన వ్యక్తి ఆగ్రాలోని షాగంజ్‌లో నివసిస్తున్నాడు. అతనికి మారుతీ స్టేట్ ఏరియాలో సొంత వ్యాపారం ఉంది. ఇటీవలే చైనా నుంచి భారత్‌కు తిరిగొచ్చాడు. అతనికి కరోనా పాజివిట్ రావడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.అతడు ఏ వేరియంట్‌తో బాధపడుతున్నారో తెలుసుకోవడానికి దాని నమూనాను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు.  

కరోనా సోకిన వ్యక్తి ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నాడు. అదే సమయంలో.. అధికారులు రోగి యొక్క కాంటాక్ట్ ట్రేసింగ్ చేస్తోంది. రోగితో పరిచయం ఉన్న వ్యక్తుల జాబితాను తయారు చేస్తున్నారు. సమాచారం ప్రకారం.. సోకిన వ్యక్తి డిసెంబర్ 23 న చైనా నుండి తిరిగి వచ్చాడు. అతని ఆరోగ్యం క్షీణించడంతో, వ్యక్తి స్వయంగా ఒక ప్రైవేట్ ల్యాబ్‌లో పరీక్ష చేయించుకున్నారు. దీంతో కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారించబడింది.

రద్దీ ప్రదేశాలలో ర్యాండమ్ టెస్టులు 

ఇంతలో ఏర్పాట్లను పరిశీలించడానికి తాజ్ మహల్ వద్దకు వచ్చిన చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అరుణ్ శ్రీవాస్తవ, కరోనా పేషెంట్ గురించి సమాచారం ఇచ్చారు. ఇటీవల చైనా నుంచి తిరిగి వచ్చిన వ్యాపారికి కరోనా పాజిటివ్‌గా తేలిందని ఆయన చెప్పారు. రోగిని బయటకు వెళ్లనివ్వబోమని హామీ ఇచ్చారు. వేరియంట్‌ను గుర్తించడానికి అతని నమూనా జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపబడింది.

ఇదే సమయంలో వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణ కమిటీలను అప్రమత్తం చేసింది. రద్దీగా ఉండే ప్రదేశాల్లో ర్యాండమ్ శాంప్లింగ్ కోసం బృందాలను నియమించినట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. విదేశీ పర్యాటకులపై ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నామని.. చైనా, జపాన్ వంటి దేశాల నుంచి వచ్చే పర్యాటకుల విషయంలో ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. అదే సమయంలో ఎయిర్‌పోర్టుకు వచ్చే వారిపై కూడా విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అందరికీ థర్మల్ స్కానింగ్ చేస్తున్నారు.

click me!