కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం.. గాలి జనార్దన్ రెడ్డి కొత్త పార్టీ.. ఇంతకీ ఆ పార్టీ పేరేంటీ?

By Rajesh KarampooriFirst Published Dec 26, 2022, 12:45 AM IST
Highlights

మాజీ మంత్రి, గనుల వ్యాపారి గాలి జనార్దన రెడ్డి కొత్త రాజకీయ అడుగు వేశారన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి తన పుట్టినరోజు సందర్భంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ఆయన తన పార్టీకి 'కల్యాణ్ రాజ్య ప్రగతి పక్షం' అని పేరు పెట్టారు. 

కర్ణాటక మాజీ మంత్రి, గనుల వ్యాపారి గాలి జనార్ధన రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటక రాజకీయాల్లో కాకరేపాడు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు  బీజేపీకి షాకిస్తూ.. సొంత పార్టీని స్థాపించారు. ఆయన తన పార్టీకి 'కల్యాణ్ రాజ్య ప్రగతి పక్షం' అని పేరు పెట్టారు. జి. జనార్దన్ రెడ్డి ఇటీవలే బీజేపీతో తెగతెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే.

ఆ తర్వాత ఆయన ఏం చేస్తారనే దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఏ పార్టీలో చేరతారు? అయితే ఈరోజు ఆ ఊహాగానాలన్నింటికీ స్వస్తి చెబుతూ..  జనార్ధన రెడ్డి తన కొత్త పార్టీని ప్రకటించారు. వచ్చే ఏడాది జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తన కొత్త పార్టీతో పోటీ చేయనున్నట్టు తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలోని కొప్పల్ జిల్లా గంగావతి నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు.

 ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం - జి జనార్దన రెడ్డి

తన నిర్ణయాన్ని నయా పొలిటికల్ స్టంట్ అని జనార్దన్ రెడ్డి అభివర్ణించారు. 'ఈరోజు నా పార్టీ 'కల్యాణ్ రాజ్య ప్రగతి పక్ష'ని ప్రకటిస్తున్నాను. బసవన్న (12వ శతాబ్దపు సంఘ సంస్కర్త) ఆలోచనతో, మతం,కులం పేరుతో విభజించే రాజకీయాలకు వ్యతిరేకంగా పార్టీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇంకా.. రాష్ట్రంలోని ఏడు జిల్లాలతో కూడిన కళ్యాణ కర్ణాటక ప్రాంత ప్రజలకు సేవ చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడి ప్రజలు ఎప్పుడూ ఐక్యంగా ఉంటారని, రాష్ట్ర ప్రజలను విభజించి ఓట్లు దండుకోవడం రాజకీయ పార్టీలకు అంత సులువు కాదని అన్నారు.
 
బీజేపీకి షాకిచ్చిన గాలి.. 

మైనింగ్ స్కాంలో ఇరుక్కున్న జనార్ధనరెడ్డిని బీజేపీ పక్కన పెట్టింది. ఈ కేసులో జనార్ధనరెడ్డి కూడా జైలు పాలయ్యారు . అతని సొంత జిల్లా బళ్లారిలోకి ప్రవేశించకుండా నిషేధించారు. గత 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. 'బీజేపీకి జానారెడ్డికి ఎలాంటి సంబంధం లేదు' అని ప్రకటించారు.

ఎప్పుడూ విఫలం కాలేదు

జానారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి పార్టీని నిర్వహించి ప్రజలతో తన అభిప్రాయాలను పంచుకుంటానని చెప్పారు. ఆయన మాట్లాడుతూ, 'నా జీవితంలో ఇప్పటివరకు ఏ కొత్త చొరవలోనూ విఫలం కాలేదు. ఎప్పటికీ వదులుకోని వారిలో నేనూ ఒకడిని. అందుకే 'కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష'తో ప్రజల మధ్యకు వెళ్తానని,  వారి ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయని, భవిష్యత్తులో కర్ణాటక సంక్షేమ రాష్ట్రంగా అవతరించడంలో సందేహం లేదని అన్నారు. 

2023 అసెంబ్లీ ఎన్నికల ప్రయాణం బీజేపీకి బ్రేకులు 

జానారెడ్డి కొత్త పార్టీ పెట్టడంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ముందు పుంజుకోవడం కష్టమే. జానారెడ్డి సొంతంగా పార్టీ పెట్టడంతో బీజేపీకి కనీసం 20 అసెంబ్లీ స్థానాలు దక్కే అవకాశాలు తగ్గాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సరే, ఇప్పుడు రాష్ట్రంలో మరో కొత్త పార్టీ రావడంతో వచ్చే ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని ఎలా పెంచుకోవాలనేది బీజేపీ ముందున్న పెద్ద డైలమా. కర్ణాటకలో 2023 ఏప్రిల్-మేలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

click me!