
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ఓ నూతన వరుడు ఫ్రెండ్స్ చెప్పారని వయాగ్రా తీసుకున్నాడు. అయితే, నిర్దేశిత ప్రమాణాల కంటే కూడా డోసు పెంచి తీసుకున్నాడు. దీంతో ఆయన లేని సమస్యలు వచ్చి చుట్టుముట్టాయి. ఈ చిక్కులు వారి కాపురానికే ప్రమాదంగా మారాయి.
ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఓ వ్యక్తి కొన్ని నెలల క్రితమే పెళ్లి చేసుకున్నాడు. ఫ్రెండ్స్ సలహాల మేరకు వయాగ్రా తీసుకోవడం మొదలు పెట్టాడు. అయితే, రికమెండ్ చేసిన క్వాంటిటీ కంటే కూడా ఆ వ్యక్తి ఎక్కువగా తీసుకోవడం ఆరంభించాడు. ఇది క్రమంగా ఓవర్ డోస్ తీసుకునే వరకు వెళ్లింది. ఫలితంగా ఆయన హాస్పిటల్ పాలు కావాల్సి వచ్చింది.
స్నేహితుల మాటలు విని ఆ నూతన వరుడు రికమెండ్ చేసిన దానికి నాలుగు రెట్లు అధికంగా వయాగ్రా డోసు తీసుకున్నాడు. 200 ఎంజీ వయాగ్రా డోసు తీసుకున్నట్టు తెలిసింది. ఫలితంగా ఆయనకు ఎవరికీ చెప్పుకోలేని వింత సమస్య వచ్చి పడింది. ఎరెక్టల్ డిస్‌ఫంక్షన్ ఉన్నప్పుడు సాధారణంగా ఈ వయాగ్రా రికమెండ్ చేస్తారు. కానీ, ఈ టాబ్లెట్స్‌ను ఓవర్ డోసుగా తీసుకోవడంతో ఆ యువకుడి ప్రైవేట్ పార్ట్ సరిగా ఫంక్షన్ చేయలేదు. సుమారు 20 రోజుల పాటు ఆ యువకుడి ప్రైవేట్ పార్ట్ ఎరెక్ట్ అయ్యే ఉన్నట్టు ఓ కథనం వెల్లడించింది.
ఈ ఘటనలు అన్నీ వధువును కలత పెట్టాయి. మానసికంగా ఇబ్బంది పడింది. దీంతో ఆమె తన తల్లి ఇంటికి వెళ్లిపోయింది. దీంతో వరుడి కుటుంబమే ఆమెను సర్ది చెప్పి వెనక్కి తెచ్చారు. కానీ, ఆ వరుడు హాస్పిటల్‌లో అడ్మిట్ కాగానే ఆమె తిరిగి వెళ్లిపోయింది.
ఆ యువకుడికి వైద్యులు చికిత్స అందించారు. పెనైల్ ప్రొస్థెసిస్ సర్జరీ చేశారు. అయినప్పటికీ ఆ యువకుడు జీవిత కాలం వెంటాడే సమస్యను వెంట పెట్టుకున్నాడు.
వైద్యుల ప్రకారం, ఆ యువకుడు పిల్లలను కనడానికి యోగ్యుడిగానే ఉంటాడని, కానీ, ఆయన ప్రైవేట్ పార్ట్‌లో టెన్షన్ కారణంగా ఎప్పటికీ పూర్తిగా చల్లబడదని (priapism) వివరించారు. ఆయన జీవితాంతం టైట్ క్లాత్స్ ధరించి తన ప్రైవేట్ పార్ట్‌ను కవర్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఇవి మానసికంగా కుంగదీసే సమస్యలు అయినప్పటికీ.. ఆ వ్యక్తి ఇప్పుడు మళ్లీ సాధారణ జీవితాన్ని గడుపుతున్నారని డాక్టర్లు చెప్పారు.