క్షణికావేశంలో భార్య హత్య.. పిల్లల నుంచి తప్పించుకునేటప్పుడు 3వ అంతస్తు నుంచి దూకి.. 

By Rajesh Karampoori  |  First Published Nov 6, 2023, 1:07 AM IST

ఒక వ్యక్తి తన భార్యతో గొడవపడి క్షణికావేశంలో దారుణానికి పాల్పడ్డాడు. ఆ దారుణాన్ని పిల్లలు చూశారు. వారు బంధించడానికి ప్రయత్నించగా.. తప్పించుకోబోయి.. అపార్ట్‌మెంట్‌ బిల్డింగ్‌ నుంచి కిందకు దూకాడు.  ఆ తరువాత ఏ జరిగిందంటే..? 


"తన కోపమే తన శత్రువు, తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ " ఈ పదాలు నూటికి నూరు పాలు వాస్తవం. ఎవరికైననూ తన కోపమే తనకు శత్రువవుతుంది. తన శాంతమే తనకు రక్షణగా నిలుస్తుంది. కానీ, క్షణికావేశంలో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి కోపంలో తన భార్యను కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటనను చూసిన పిల్లలు తన తండ్రిని బంధించబోగా.. తప్పించుకోవడానికి వెళ్లి అపార్ట్‌మెంట్‌ బిల్డింగ్‌ నుంచి కిందకు దూకాడు. తీవ్రంగా గాయాల పాలయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో జరిగింది.

వివరాల్లోకెళ్తే.. లక్నోలోని అలయా అపార్ట్‌మెంట్‌లో ఆదిత్య కపూర్ అనే వ్యక్తి తన భార్య పిల్లలతో కలసి జీవనం సాగిస్తున్నారు. ఆదిత్యకు బట్టల షోరూమ్ ఉండేది. కానీ కరోనా లాక్‌డౌన్ కారణంగా అతని వ్యాపారం మూతపడింది. కుటుంబ పోషణ కోసం వేరొకరి బట్టల దుకాణంలో పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ కారణంగా అతను తరచుగా డిప్రెషన్‌లోకి వెళ్లేవాడు. చాలా సార్లు ఆమె ఆత్మహత్యతో తన జీవితాన్ని ముగించాలని ప్రయత్నించాడు. ఈ తరుణంలో అతను మద్యానికి బానిసగా మారాడు. 

Latest Videos

undefined

మద్యం మత్తులో తరచూ భార్యతో గొడవ పడేవాడు. ఎప్పటిలాగానే శనివారం కూడా పుల్ గా తాగి అర్ధరాత్రి వేళ ఇంటికి చేరుకున్నారు. ఆలస్యం కావడంతో కోపంతో ఉన్న భార్య శివాని కపూర్ తలుపు తీయలేదు. చాలా ప్రయత్నాల తర్వాత.. తలుపు తెరవడంతో ఆదిత్య తన భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ఇద్దరి మధ్య గొడవ ఎంత స్థాయికి చేరిందంటే.. కోపంతో ఆదిత్య వంటగదిలోంచి కత్తి తీసుకుని శివానిపై దాడి చేయడం ప్రారంభించాడు. ఈ దాడిలో భార్య శివాని  వెన్ను, మెడపై తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావంతో ఆమె అక్కడే ప్రాణాలు కోల్పోయింది.

ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ దారుణమంతా తమ ఇద్దరు పిల్లల కళ్ల ముందే జరగడం. భయం, భయాందోళనల కారణంగా పిల్లలు మొదట ఏమీ మాట్లాడలేదు. కానీ తల్లిని హత్య చేయడాన్ని చూసి, వారు తమ తండ్రిపై విరుచుకుపడ్డారు. పిల్లలిద్దరూ  తమ తండ్రిని ఓ గదిలో ఉంచి బయట నుంచి తాళం వేసేందుకు ప్రయత్నించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. వారిని తోసేసి పారిపోయాడు. తప్పించుకునేందుకు మూడో అంతస్తు నుంచి కిందకు దూకాడు. ఈ సమయంలో ఆదిత్య తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని మెడికల్ కాలేజీలోని ట్రామా సెంటర్‌లో చేర్చారు. 

మరోవైపు.. పిల్లలు వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శివాని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వైద్య కళాశాలకు తరలించారు. ప్రస్తుతం ఆదిత్య, శివాని ఒకే ఆసుపత్రిలో ఉండగా ఒకరు మృతి చెందగా, మరొకరు జీవన్మరణ మధ్య ఊగిసలాడుతున్నారు. క్షణికావేశంలో తీసుకున్న ఓ నిర్ణయం వల్ల అమాయక చిన్నారులు జీవితం ప్రశ్నార్థకంగా మారింది. వారి భవిష్యత్తు అంధకారంలో పడింది. కుటుంబం మొత్తం చెల్లాచెదురైంది.

click me!