వ్యాక్సిన్ కోసం వెడితే పోలీసులు చితకబాదారు.. అవమానంతో ఉరేసుకుని యువకుడి మృతి...

Published : Jul 27, 2021, 05:07 PM IST
వ్యాక్సిన్ కోసం వెడితే పోలీసులు చితకబాదారు.. అవమానంతో ఉరేసుకుని యువకుడి మృతి...

సారాంశం

సోమవారం వ్యాక్సిన్ సెంటర్ కి వెళ్లిన ఇరవయ్యేళ్ల యువకుడిని పోలీసులు అడ్డుకుని, లాఠీలతో అతడిమీద దాడి చేశారు. 90 సెకండ్ల నిడివి గల ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

ఉత్తరప్రదేశ్ లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్లిన ఓ యువకుడిని పోలీసులు లోపలికి అనుమతించకపోగా, అతడిమీద దాడిచేయడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బాగ్ పట్ జిల్లాలో జరిగింది. 

సోమవారం వ్యాక్సిన్ సెంటర్ కి వెళ్లిన ఇరవయ్యేళ్ల యువకుడిని పోలీసులు అడ్డుకుని, లాఠీలతో అతడిమీద దాడి చేశారు. 90 సెకండ్ల నిడివి గల ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

ఆ వీడియోలో ఇద్దరు పోలీసులు అతడిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అందులో జోక్యం చేసుకున్న ఇంకో వ్యక్తిని కూడా తోసేశారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటలకే ఆ యువకుడు ఊరి చివరి చెట్టుకున ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది.

కరోనామహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన బాధితులు లక్షల్లో ఉంటే.. కొన్ని చోట్ల వ్యాక్సిన్ సెంటర్ల దగ్గర తోపులాట, వాగ్వాదాలు జరుగుతున్న సంఘటనలు కూడా ఈ మధ్య తరచూ కనిపిస్తున్నాయి. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఐదుగురు పోలీసులకు విధుల నుంచి తొలగించారు. 

PREV
click me!

Recommended Stories

నిర్మాత తిని ప‌డేసిన బొక్క‌లు తిన్న రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఎందుక‌ని అడ‌గ్గా, ఊహ‌కంద‌ని ఆన్స‌ర్‌
Viral Video: ఏసీలో నుంచి వింత శ‌బ్ధాలు.. ఏంటా అని చూడ‌గా గుండె గుబేల్‌, వైర‌ల్ వీడియో