
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. తన చెల్లి ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నట్టు గుర్తించాడు. అతనితో రిలేషన్ పెట్టుకోవడాన్ని సహించలేదు. తీవ్రంగా వ్యతిరేకించాడు. అంతటితో ఆగలేదు. తన సొంత చెల్లిని అతిదారుణంగా చంపేశాడు. ఆ టీనేజీ బాలిక తల నరికేశాడు. ఆ తలతో సోదరుడు ఊరిలో తిరిగాడు. ఈ ఘటన బారాబంకీలో శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది.
నిందితుడిని పోలీసులు రియాజ్‌గా గుర్తించారు. తన 18 ఏళ్ల సోదరి ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నట్టు గుర్తించాడు. ఆ వ్యవహారం రియాజ్‌కు నచ్చలేదు. తీవ్రంగా వ్యతిరేకించాడు. ఒకే తల్లికి పుట్టామని సొంత చెల్లిపై కాస్త కనికరం కూడా ఆయనకు లేకుండా పోయింది. సోదరిపై ప్రేమ, ఆప్యాయతలు రియాజ్‌లో మంట గలిసిపోయాయి. సొంత చెల్లిని ఇంటికి సమీపంలోనే ఒక పదునైన ఆయుధంతో దాడి చేసి చంపేశాడు. ఆమె తలను అత్యంత దారుణంగా నరికేశాడు. ఆ తలను చేతిలో పట్టుకుని ఊరేగాడు.
Also Read: కవిత, కేటీఆర్‌లపై వ్యాఖ్యలు.. నాకు కొందరి బెదిరింపు : సుఖేష్ మరో లేఖ , సీబీఐ విచారణకు డిమాండ్
ఈ ఘటన చూడగానే గ్రామస్తులు నిర్ఘాంతపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రియాజ్ కూడా నరికేసిన తన చెల్లి తలను పట్టుకుని పోలీసు స్టేషన్‌కు వెళ్లే దారిలోనే ఉన్నాడని స్థానికులు చెప్పారు. పోలీసులు రియాజ్‌ను అరెస్టు చేసి తీసుకెళ్లారు.