భార్య చదవుకు సపోర్టు చేశాను.. కానీ ఇప్పుడే ఆమె దాడి చేసింది..: భర్త ఆవేదన

Published : Aug 13, 2023, 04:05 PM IST
భార్య చదవుకు సపోర్టు  చేశాను.. కానీ ఇప్పుడే ఆమె దాడి చేసింది..: భర్త ఆవేదన

సారాంశం

ఓ వ్యక్తిపై అతని భార్య దాడి చేసింది. తన సోదరులతో కలిసి అతడి కాళ్లు విరిగొట్టింది. అయితే తన భార్య చదువుకు తాను మద్దతిచ్చానని.. కానీ ఇప్పుడు ఆమె తనపై దాడి చేస్తుందని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు.

ఓ వ్యక్తిపై అతని భార్య దాడి చేసింది. తన సోదరులతో కలిసి అతడి కాళ్లు విరిగొట్టింది. అయితే తన భార్య చదువుకు తాను మద్దతిచ్చానని.. కానీ ఇప్పుడు ఆమె తనపై దాడి చేస్తుందని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బండాలో చోటుచేసుకుంది. వివరాలు.. కమతా ప్రసాద్ అనే వ్యక్తి తన భార్యను మేనల్లుడికి భోజనం పెట్టావా అని అడగడంతో వివాదం తలెత్తింది. ఈ క్రమంలోనే కోపోద్రిక్తులైన ప్రసాద్ భార్య, ఆమె సోదరులు.. అతడిపై దాడి చేశారు. అతడి కాళ్లు విరగొట్టారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే రంగప్రవేశం చేసి ప్రసాద్‌ను వైద్య చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

తన భార్య చదువుకు మద్దతు ఇచ్చానని ప్రసాద్ పేర్కొన్నాడు. ఆమె బి.ఎడ్, ఎం.ఎడ్, పీహెచ్‌డీ సాధించడానికి సహాయం చేశానని.. చివరికి ఆమె లెక్చరర్‌గా మారిందని తెలిపాడు. అయితే తాను పనికానివాడనని తన భార్య తరచూ దూషించేదని అతడు పేర్కొన్నాడు. మరోవైపు ప్రసాద్ మద్యం సేవించి అసభ్యంగా ప్రవర్తించేవాడని అతడి భార్య సోదరుడు తెలిపాడు.

కాగా, ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని పోలీసులు చెప్పారు.  తాము ఎవరిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోకూడదని కూడా వారు పేర్కొన్నారు. అయితే అధికారికంగా ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !