
Chhattisgarh earthquake:ఛత్తీస్ గఢ్ లోని గౌరెలా-పెంద్రా-మార్వాహి, కోర్బా జిల్లాల్లో ఆదివారం ఉదయం 9 గంటలకు 3.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. కోర్బా వెస్ట్ లో భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం కారణంగా పలు ఇండ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. భూకంపం కారణంగా ఎలాంటి మరణాలు సంభవించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో ఆస్తి నష్టానికి సంబంధించి బాధితులు అధికారులు సమాచారం అందించాలని పేర్కొన్నాయి.
వివరాల్లోకెళ్తే.. ఛత్తీస్ గఢ్ లో స్వల్ప భూకంపం సంభవించింది. అయితే, ప్రాణనష్టం జరగలేదు. పరిస్థితిని క్షుణ్ణంగా పర్యవేక్షించాలని, ఏదైనా నష్టం జరిగితే నివేదించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. ఛత్తీస్ గఢ్ లోని సరిహద్దు ప్రాంతమైన గౌరెలా-పెంద్రా-మార్వాహి (జీపీఎం), కోర్బా జిల్లాల్లో ఆదివారం ఉదయం 3.6 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. రెండు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.
"ఉదయం 9.09 గంటలకు పెండ్రా పట్టణం, పరిసర ప్రాంతాలలో 3.6 తీవ్రతతో ప్రకంపనలు సంభవించాయి. కోర్బా, GPM జిల్లాల సరిహద్దులోని చందౌతి గ్రామంలో భూమి ఉపరితలం నుండి ఐదు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది" అని వాతావరణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఇది 'లైట్' కేటగిరీ ప్రకంపన అనీ, ఇది పెద్ద విధ్వంసం కలిగించదని అధికారులు తెలిపారు. అయితే భూకంప కేంద్రం కేవలం ఐదు కిలోమీటర్ల లోతులో (భూ ఉపరితలం నుంచి) ఉందని, అందువల్ల 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఇళ్లకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలిపారు. పరిస్థితిని క్షుణ్ణంగా పర్యవేక్షించాలనీ, ఏదైనా నష్టం జరిగితే నివేదించాలని స్థానిక అధికారులను ఆదేశించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.
నివేదికల ప్రకారం.. పలు ప్రాంతాల్లో భూకంపం చాలా తీవ్రంగా ఉంది. భూ ప్రకంపనలు సంభవించిన వెంటనే భయాందోళనకు గురైన ప్రజలు త్వరగా వారి ఇళ్ల నుండి బయటకు వచ్చారు. కోర్బాలో ప్రకంపనల శబ్దం కూడా వినిపించిందని స్థానికులు చెప్పారు. భూకంపం కారణంగా ప్రభావిత ప్రాంతాల్లోని పలు ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. దాదాపు 3 నుంచి 4 సెకన్ల పాటు కుంభకోణాలు కొనసాగాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కాగా, దీనికి ముందు ఆగస్టు 10న హిమాచల్ ప్రదేశ్‌లో కూడా భూకంపం సంభవించింది. హిమాచల్‌లోని లాహౌల్-స్పితి ప్రాంతం భూకంప ప్రకంపనలను అనుభవించింది. భూకంపం అర్థరాత్రి సంభవించిందని, రిక్టర్ స్కేలుపై 3.3 తీవ్రతతో నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ నివేదించింది.