యూపీఐటీఎస్ 2024 లో ఈసారి బాలీవుడ్ సింగర్స్ కనికా కపూర్, అంకిత్ తివారీ, పవన్‌దీప్ రాజన్, అరుణిత కాంజిలాల్ తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. సెప్టెంబర్ 25 నుంచి 29 వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో రష్యా, బొలీవియా, కజకిస్తాన్, బ్రెజిల్ వంటి దేశాలకు చెందిన కళాకారులు కూడా తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు.
లక్నో : ఉత్తర ప్రదేశ్ లో ఈ నెల సెప్టెంబర్ 25 నుండి అంటే రేపటినుండి ఇంటర్నేషనల్ ట్రెడ్ షో (యూపీఐటిఎస్) జరగనుంది. గ్రేటర్ నోయిడాలో ఇప్పటికే ఈ ట్రేడ్ షో కోసం భారీ ఏర్పాట్లు చేసింది యోగి సర్కార్. సెప్టెంబర్ 29 వరకు అంటే ఐదు రోజులపాటు జరిగే ఈ షో జరగనుంది. అంతర్జాతీయ స్థాయిలో చేపట్టనున్న ఈ షోను అదే స్థాయిలో ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగానే బాలీవుడ్ తో పాటు అంతర్జాతీయ సింగర్స్ తో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటుచేసారు.
ఈ ట్రేడ్ షో ద్వారా ఉత్తరప్రదేశ్ వాణిజ్య రంగాన్ని ప్రపంచానికి పరిచయం చేయడమే కాకుండా రాష్ట్ర సంస్కృతిని కూడా ప్రదర్శించనున్నారు. ఇందుకోసం యూపీకి చెందిన సాంప్రదాయ జానపద నృత్య,గాన కళాకారులతో అంతర్జాతీయ అతిథుల కోసం కార్యక్రమాలు ఏర్పాటుచేసారు. అలాగే రష్యా, బొలీవియా, కజకిస్తాన్, బ్రెజిల్, వెనిజులా, ఈజిప్ట్, బంగ్లాదేశ్ వంటి దేశాల కళాకారులు కూడా అ షో ద్వారా తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు.
undefined
కనికా కపూర్, పవన్‌దీప్, అరుణిత, అంకిత్ తివారీ వంటి బాలీవుడ్ కళాకారుల ప్రదర్శన :
యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో సెకండ్ ఎడిషన్‌లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో సందర్శకులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఆస్వాదించవచ్చు. సెప్టెంబర్ 25న తొలి రోజు నోయిడాకు చెందిన మాధవి మధుకర్ భజన కార్యక్రమంతో పాటు వియత్నాం కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. తొలి రోజు బాలీవుడ్ సింగర్ అంకిత్ తివారీ పాటలతో ప్రేక్షకులను అలవిస్తారు.
ఇక రెండోరోజు అంటే సెప్టెంబర్ 26న ఐసీసీఆర్ ద్వారా బొలీవియా, రష్యా, బంగ్లాదేశ్, కజకిస్తాన్, బ్రెజిల్, వెనిజులా, ఈజిప్ట్ వంటి దేశాల కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శిస్తారు. ప్రయాగరాజ్‌కు చెందిన నీలాక్షి రాయ్ 'ప్రేమ్ కే రంగ్, కృష్ణ కే సంగ్' ప్రదర్శనతో ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతారు. సాయంత్రం బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ పాటలతో సందడి చేయనున్నారు.
సెప్టెంబర్ 27న మథురకు చెందిన మాధురి శర్మ బ్రజ్ జానపద గీతాలతో అలరిస్తారు. ప్రసిద్ధ గాయకులు పవన్‌దీప్, అరుణిత కూడా ట్రేడ్ షోలో తమ గానంతో అలరించనున్నారు. సెప్టెంబర్ 28న లక్నోకు చెందిన సంజోలి పాండే, సహారన్‌పూర్‌కు చెందిన రంజన నేబ్ రామకథ ఆధారంగా కథక్ నృత్య నాటికను ప్రదర్శిస్తారు. కృష్ణ భక్తి గీతాలపై మాధవ బ్యాండ్ ప్రదర్శన ఉంటుంది.
సెప్టెంబర్ 29న మహోబాకు చెందిన జితేంద్ర చౌరసియా బుందేలి జానపద గీతాలతో అలరిస్తారు. ఆగ్రాకు చెందిన ప్రీతి సింగ్ హనుమాన్ చాలీసాపై నృత్య నాటికను ప్రదర్శిస్తారు. డాక్టర్ పలాష్ సేన్ యొక్క యుఫోరియా బ్యాండ్ ప్రదర్శన ఉంటుంది.
జానపద కళాకారులకు అంతర్జాతీయ వేదిక
జానపద సంస్కృతిని ప్రోత్సహించడంపై యోగి ప్రభుత్వానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది... అందులో భాగంగానే ఐటీఎస్‌లో వీరికి ప్రత్యేకంగా అవకాశం కల్పించారు. ప్రయాగరాజ్‌కు చెందిన ప్రీతి సింగ్ బృందం ఢేఢియా నృత్యాన్ని, బాందాకు చెందిన రమేష్ పాల్ పైడండాను, అయోధ్యకు చెందిన శీతల ప్రసాద్ వర్మ ఫరువాహిని, అయోధ్యకు చెందిన సుమిష్టా మిత్రా బఢావా జానపద నృత్యాన్ని, ఆగ్రాకు చెందిన దేవేంద్ర ఎస్ మంగళముఖి కథక్‌ను, ఝాన్సీకి చెందిన వందన కుశ్వాహ రాయిని, పిలిభిత్‌కు చెందిన బంటీ రాణా థారు, దీపక్ శర్మ మయూర్ జానపద నృత్యాన్ని, లక్నోకు చెందిన ప్రీతి తివారీ కథక్ నృత్య నాటికను, గోరఖ్‌పూర్‌కు చెందిన రామ్‌జ్ఞాన్ యాదవ్ ఫరువాహి జానపద నృత్యాన్ని, ఝాన్సీకి చెందిన రఘువీర్ సింగ్ యాదవ్ పై-డండా నృత్యాన్ని ప్రదర్శిస్తారు. వీటితో పాటు ఉత్తరప్రదేశ్‌లోని వివిధ జిల్లాలకు చెందిన కళాకారులు కూడా తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు.