ఉత్తర ప్రదేశ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో ఈ-కామర్స్, స్టార్టప్‌లతో సహా వివిధ రంగాలలో వ్యూహాత్మక భాగస్వామ్యాలు, అభివృద్ధిపై దృష్టి సారించింది.
గ్రేటర్ నోయిడా : ఉత్తర ప్రదేశ్ ను అభివృద్ది చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది యోగి ప్రభుత్వం. ఈ క్రమంలోనే రాష్ట్రానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడంలో కీలక ముందడుగు వేసింది. గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో మార్ట్‌లో జరుగుతున్న యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో (UPITS) రెండవ ఎడిషన్‌లో భాగంగా రెండవ రోజు వివిధ రకాల నాలెడ్జ్ సెషన్‌లు నిర్వహించారు. గురువారం ఇండియా-వియత్నాం బిజినెస్ ఫోరం సెషన్, ఈ-కామర్స్ సెషన్, ఎకేటియూ ఆధ్వర్యంలో ఇన్నోవేషన్ ఆండ్ స్టార్టప్‌లపై సెషన్ నిర్వహించారు.
ఈ-కామర్స్, ఇన్నోవేషన్ ఆండ్ స్టార్టప్‌లపై జరిగిన సెషన్‌లో ప్రపంచవ్యాప్తంగా మారుతున్న డిజిటల్ పరిణామంలో ఉత్తర ప్రదేశ్ పాత్రపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం యోగి ఆలోచనలతో రూపొందిన సెక్టోరల్ పాలసీలపై కూడా దృష్టి సారించారు.
undefined
రెండో రోజు 40 వేల మందికి పైగా సందర్శకులు
యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో 2024 బుధవారం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం యోగి, కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రి గీతా రామ్ మాంఝీలలో రాజకీయ, వ్యాపార ప్రముఖులు పాల్గొన్నారు. ఈ గ్లోబల్ ఈవెంట్ సెప్టెంబర్ 29న ముగియనుంది.
రెండవ రోజు అంటే ఇవాళ గురువారం 18,000 మందికి పైగా కొనుగోలుదారులు, 40,000 మందికి పైగా సందర్శకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా, వివిధ సెషన్లు, కార్యక్రమాలలో యోగి ప్రభుత్వం తరపున క్యాబినెట్ మంత్రి (MSME) రాకేష్ సచాన్, ఎలక్ట్రానిక్స్ & సమాచార సాంకేతిక శాఖ మంత్రి సునీల్ కుమార్ శర్మ, మీరట్ కమిషనర్ శిల్వి కుమారితో సహా పలువురు అధికారులు, ప్రపంచ దిగ్గజ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
వ్యూహాత్మక భాగస్వామ్యాలపై యోగి ప్రభుత్వం దృష్టి
గురువారం యూపీఐటిఎస్ 2024లో భాగంగా నిర్వహించిన సెక్టోరల్ సెషన్‌లలో మొదటి సెషన్ భారతదేశం, వియత్నాంల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై సాగింది, ఈ సెషన్‌ను వియత్నాం భాగస్వామ్య దేశంగా నిర్వహించింది. వియత్నాం రాయబారి గుయేన్ తాన్ హైతో సహా వియత్నామీస్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సెషన్‌లో యోగి ప్రభుత్వం తరపున క్యాబినెట్ మంత్రి రాకేష్ సచాన్, ఎలక్ట్రానిక్స్ & సమాచార సాంకేతిక శాఖ మంత్రి సునీల్ కుమార్ శర్మ, ఎంఎస్ఎఈ శాఖ ప్రతినిధి, ప్రిన్సిపల్ సెక్రటరీ అలోక్ కుమార్‌తో సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో వియత్నాం, భారతదేశం వరుసగా దక్షిణాసియా, ఆసియన్ మార్కెట్లలోకి ప్రవేశించడానికి ఒకరికొకరు వ్యూహాత్మక ప్రదేశాలను ఉపయోగించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. దీని ద్వారా ఉత్తర ప్రదేశ్ ఉత్పత్తులు కూడా ఈ మార్కెట్లలోకి ప్రవేశించడానికి మార్గం సుగమం అవుతుంది. ఈ సందర్భంగా రాకేష్ సచాన్ మాట్లాడుతూ, భారత్, వియత్నాంలు రెండూ సుదీర్ఘకాల సాంస్కృతిక సంబంధాలను కలిగి ఉన్నాయని, అవి వాటిని సహజ భాగస్వాములుగా మారుస్తాయని అన్నారు. భారతదేశంలో ఒక ప్రధాన ఆధ్యాత్మిక గమ్యస్థానంగా అవతరించిన ఉత్తర ప్రదేశ్‌లో, ముఖ్యంగా పర్యాటకం, ఆతిథ్య రంగాల్లో పెట్టుబడి అవకాశాలను అన్వేషించాలని ఆయన పెట్టుబడిదారులను ఆహ్వానించారు.
ఈ-కామర్స్ సెషన్‌లో దిగ్గజ సంస్థల వక్తలు
ఈ కార్యక్రమంలో భాగంగా రెండవ సెషన్‌లో ఈ-కామర్స్ రంగంపై అభిప్రాయాలను పంచుకున్నారు. గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, ప్రీమియర్ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్ పేటీఎం, రిటైలర్లకు ప్రసిద్ధి చెందిన బిగ్‌బాస్కెట్ వంటి సంస్థల ప్రతినిధులు వేదికను పంచుకుని, హాజరైన వారితో తమ విలువైన అభిప్రాయలను, ఆచరణాత్మక వ్యూహాలను పంచుకున్నారు. డిజిటల్ పరివర్తన ద్వారా చిన్న, మధ్య తరహా సంస్థలను (MSME) బలోపేతం చేయడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా మార్కెట్ యాక్సెస్‌ను మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని రాకేష్ సచాన్ ఈ సెషన్‌లో నొక్కి చెప్పారు.
ఇన్నోవేషన్ & స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధిపై సెషన్లు
గురువారం నిర్వహించిన వివిధ నాలెడ్జ్ సెషన్‌లలో భాగంగా వ్యవస్థాపకులు, అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలు, స్టార్టప్‌లు, కొత్త వ్యాపారాలు చేయాలనుకునేవారి కోసం వరుసగా మూడు సెషన్‌లను నిర్వహించారు. 'ఇన్నోవేషన్ & స్టార్టప్' సెషన్‌ను అబ్దుల్ కలాం సాంకేతిక విశ్వవిద్యాలయం (AKTU) నిర్వహించింది. ఈ సెషన్‌లో AKTUలోని ఎక్సలెన్స్‌ను ప్రోత్సహించే కార్యక్రమాల గురించి వివరించారు.
ఎకెటియు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జె.పి. పాండే 'అకాడెమిక్ ఎక్సలెన్స్ నుండి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వరకు' అనే అంశంపై ప్రజెంటేషన్ ఇచ్చారు. AKTU ఇన్నోవేషన్ హబ్ హెడ్ మహీప్ సింగ్, ఇన్నోవేషన్ హబ్ మేనేజర్ వందన శర్మ ఈ సెషన్‌లో ఇన్నోవేషన్ హబ్ ఉత్తర ప్రదేశ్‌లోని వ్యవస్థాపకులు, స్టార్టప్‌లను ఎలా బలోపేతం చేస్తుందో, స్థానిక స్టార్టప్‌లకు నిధుల కోసం మార్గాలను ఎలా సృష్టిస్తుందో వివరించారు.