UPITS 2024 లో ఫిన్‌టెక్ సిటి, సెమీ కండక్టర్, సాఫ్ట్‌వేర్ పార్క్ స్టాల్స్...

By Arun Kumar PFirst Published Sep 26, 2024, 6:42 PM IST
Highlights

యూపీఐటిఎస్ 2024లో యమునా ఎక్స్‌ప్రెస్‌వే అథారిటీ తన ముఖ్య ప్రాజెక్టులైన ఫిన్‌టెక్ సిటీ, సెమీకండక్టర్ పార్క్, సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్‌లను ప్రదర్శిస్తోంది. ఈ ప్రాజెక్టుల నమూనాలు, సమాచారం స్టాల్స్‌లో అందుబాటులో ఉన్నాయి.

గ్రేటర్ నోయిడా : అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన ద్వారా యోగి ప్రభుత్వం ఉత్తరప్రదేశ్‌ను ప్రపంచానికి సరికొత్తగా పరిచయం చేసుకుంటోంది. పారిశ్రామికంగా రాష్ట్రం ఎంత అభివృద్ది చెందిందో తెలియజేస్తూ మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. అలాగే ఈ యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో 2024 ద్వారా యూపీ సాంప్రదాయ చేతివృత్తులు, కళలను ప్రోత్సహించేందుకు సిద్దమైంది. ఇందుకోసమే ఈ యూపిఐటిఎస్ సెకండ్ ఎడిషన్‌లో వివిధ స్టాల్స్‌ను ప్రత్యేకంగా ఏర్పాటుచేసింది యోగి సర్కార్. 

 ఈ క్రమంలోనే యమునా ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ (YEIDA) భవిష్యత్ లో చేపట్టబోయే ప్రాజెక్టులపై దృష్టి సారించింది, ముఖ్యంగా త్వరలో ప్రారంభించబోయే ప్రాజెక్టులైన ఫిన్‌టెక్ సిటీ, సెమీకండక్టర్ పార్క్, సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ లపై దృష్టి సారించారు. ఈ మూడు ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలతో YEIDA తన స్టాల్స్‌ను ఏర్పాటు చేసింది.

Latest Videos

ఈ యమునా అథారిటీ స్టాల్స్‌లో ప్రాజెక్టుల నమూనాలతో పాటు వాటి గురించి వివరణాత్మక సమాచారం కూడా అందించబడుతోంది, తద్వారా సందర్శకులు ఈ పథకాల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రదర్శనలో యమునా అథారిటీకి హాల్ నంబర్ 3లో 1644 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించారు,  ఇందులోనే ఫిన్‌టెక్ సిటీ, సెమీకండక్టర్ పార్క్, సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్ రాబోయే అభివృద్ధి ప్రాజెక్టులను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి.

సెమీకండక్టర్ పాార్క్ కోసం ల్యాండ్ రెడీ    

యమునా అథారిటీ సీఈఓ అరుణ్ వీర్ సింగ్ మాట్లాడుతూ... ఇప్పటికే సెమీకండక్టర్ పార్క్ ఏర్పాటుకు భూమిని సిద్దం చేసినట్లు తెలిపారు. ఇటీవల గ్రేటర్ నోయిడాలో జరిగిన సెమీకాన్ సదస్సులో చాలా మంది పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కూడా చూపారని  తెలిపారు. మూడు ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించాల్సి వుందన్నారు.  వీటితో పాటు మరికొన్ని కంపెనీలు కూడా ముందుకు వస్తున్నాయని... వాటిలో కొన్ని అమెరికా కంపెనీలు కూడా ఉన్నాయన్నారు.  

సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ పథకం :

అరుణ్ వీర్ సింగ్ సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పాార్క్ గురించి మాట్లాడుతూ... ఇప్పటివరకు యమునా ఎక్స్‌ప్రెస్‌వేలో ఐటీ, ఐటీఈఎస్ సొల్యూషన్స్ కోసం ప్రత్యేక సెక్టార్ లేదని అన్నారు. కాబట్టే ఇప్పుడు సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్‌ను నిర్మించాలని నిర్ణయించామన్నారు. ఇన్ఫోసిస్, విప్రో, టాటా వంటి పెద్ద కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని ... ఈ కంపెనీలను భాగస్వామ్యం చేసుకుని ఓ అద్భుతమైన సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్‌ను నిర్మించాలనుకుంటున్నామన్నారు. అందుకే ఐటీ, ఐటీఈఎస్ సొల్యూషన్స్ కోసం ప్రత్యేకంగా భూమిని కేటాయించామన్నారు.

ఫిన్‌టెక్ పార్క్ పనులు వేగంగా జరుగుతున్నాయి

ఇక ఫిన్ టెక్ పార్క్ గురించి  అరుణ్ వీర్ సింగ్ మాట్లాడుతూ ... త్వరలోనే దీనిని ప్రారంభించబోతున్నామని తెలిపారు. ఇక్కడ హావెల్స్, యాంకర్ వంటి యూనిట్లు వస్తున్నాయని తెలిపారు. EMC-2 ప్రతిపాదన భారత ప్రభుత్వ పరిశీలనలో వుంది... అతి త్వరలోనే దీనికి ఆమోదం లభించే అవకాశాలున్నాయని తెలిపారు. వాటాదారులు, ఫైనాన్సింగ్ సంస్థలు, స్టాక్ బ్రోకర్లు, బీమా కంపెనీలు, నియంత్రణ అధికారులతో సమావేశం నిర్వహించి ఒక పథకాన్ని రూపొందిస్తామని.... వారి డిమాండ్ ప్రకారయే తదుపరి చర్యలు తీసుకుంటామని అరుణ్ వీర్ సింగ్ వెల్లడించారు.

 

click me!