లవ్ ఎఫైర్ ఉన్నదని 17 ఏళ్ల బాలిక హత్య.. సోదరుడు, తండ్రి కలిసి చంపిన వైనం

Published : Apr 23, 2022, 03:28 PM IST
లవ్ ఎఫైర్ ఉన్నదని 17 ఏళ్ల బాలిక హత్య.. సోదరుడు, తండ్రి కలిసి చంపిన వైనం

సారాంశం

తమకు నచ్చిన యువకుడితో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నదని 17 ఏళ్ల బాలికను ఆమె తండ్రి, సోదరుడు తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత గొంతు నులిమేసి చంపేశారు. ఆమె మృతదేహాన్ని ఇంటి వెనుక పశువుల కొట్టంలో పూడ్చి పెట్టారు. ఆ బాలిక అదే కులానికి చెందిన అబ్బాయినే ప్రేమించింది.

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తమ ఇంటి ఆడపిల్ల తమకు ఇష్టం లేని యువకుడిని ప్రేమిస్తున్నదని దారుణానికి ఒడిగట్టారు. ఎవరికీ తెలియకుండా గొంతు నులిమి చంపి వారి ఇంటి వెనుకే ఉన్న పశువుల కొట్టం కింద పాతి పెట్టారు. అయితే, గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు వచ్చారు. వారిని ప్రశ్నించారు. అనంతరం ఆ పశువుల కొట్టం కింద పాతి పెట్టిన శవాన్ని తవ్వి తీశారు. పోస్టుమార్టం కోసం ఆ బాలిక మృత దేహాన్ని హాస్పిటల్‌కు పంపించారు.

బాండా జిల్లాలోని గుర్హ కాలా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ బాలిక మృతదేహంపై గాయాలు కనిపించాయి. గొంతు నులిమేయడం వల్లనే మరణించినట్టు పోస్టుమార్టం రిపోర్టు ధ్రువీకరించింది.

పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గుర్హ కాలా గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక అదే కులానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. ఒకే కులం అయినప్పటికీ ఆ యువకుడితో రిలేషన్‌షిప్ పెట్టుకోవడం ఆ బాలిక తండ్రి, సోదరుడికి నచ్చలేదు. ఆ సంబంధాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు.

ఈ వ్యతిరేకత కారణంగానే తండ్రి, సోదరుడు ఇంటి ఆడపిల్లనే పొట్టనబెట్టుకోవడానికి సిద్ధం అయ్యారు. ఆ బాలికను భౌతికంగా దాడి చేశారు. ఆ తర్వాత ఆమె గొంతు నులిమేశారు. ఎవరికీ తెలియకుండా వారి ఇంటి వెనకాల ఉన్న పశువులను ఉంచే నివాసం అడుగున గొయ్యి తవ్వి పాతిపెట్టారు. కానీ, వారి తీరులో అనుమానాస్పదంగా ఉండటంతో స్థానికుల్లో కొంత సందేహాలు వచ్చాయి. బాలికను హత్య చేసి ఉండొచ్చని పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు స్పాట్‌కు వచ్చారు. ఆ పశువుల కొట్టంలోని గొయ్యి ఆనవాళ్లను చూసి అక్కడి నుంచి డెడ్ బాడీని బయటకు తీశారు. ఆ తర్వాత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటనపై సర్కిల్ ఆఫీసర్ నారెయినీ డీఎస్పీ నితిన్ కుమార్ శనివారం మాట్లాడారు.

ఆ 17 ఏళ్ల బాలికను చంపేశారని, పశువుల కొట్టంలో పూడ్చి పెట్టారని గ్రామస్తులు తమకు సమాచారం ఇచ్చారని వివరించారు. దీంతో తాము శుక్రవారం స్పాట్‌కు వెళ్లి బాడీ తీయించి పోస్టుమార్టం చేయించామని తెలిపారు. శుక్రవారం సాయంత్రం పోస్టుమార్టం నివేదిక వచ్చిందని పేర్కొన్నారు. ఆ బాలిక డెడ్ బాడీపై గాయాలు ఉన్నట్టు తేలిందని, ఆమె గొంతు నొక్కడం వల్లే మరణించారని రిపోర్టు పేర్కొందని వివరించారు.

ఆ పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు ఆ బాలిక తండ్రి దేశరాజ్, సోదరుడు ధనంజయ్‌పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. కులదురహంకార హత్యగా కేసు నమోదు చేసినట్టు వివరించారు. వారిద్దరినీ శుక్రవారం రాత్రి అరెస్టు చేసి తీసుకెళ్లినట్టు చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం
PM Surya Ghar Scheme : ఇలా చేశారో విద్యుత్ ఛార్జీలుండవు.. డబ్బులు సేవ్