
Uttar Pradesh: ఒకే కుంటుంబానికి చెందిన ఐదుగురిని దారుణంగా హత్య చేశారు. వీరందరిపై పదునైన ఆయుధాలతో దాడి చేసి హత్య చేసిన గుర్తులు ఉన్నాయి. వీరిని హత్య చేసిన అనంతరం ఇంటికి నిప్పు పెట్టారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు... దర్యాప్తు ప్రారంభించారు. మృత దేహాలను శవపరీక్షలకు పంపారు. కాగా, ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. గత కొంత కాలంగా ఈ ప్రాంతంలో సామూహిక హత్యలు పెరుగుతుండటంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటన గురించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు తమ ఇంటిలో శవమై కనిపించారు. థర్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖేవ్‌రాజ్‌పూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వీరందరిపై పదునైన ఆయుధాలతో దాడి చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సామూహిక హత్యల తర్వాత నిందితులు ఆ ఇంటికి నిప్పుకూడా పెట్టారు. జిల్లాలో ఇంతకుముందు కూడా సామూహిక హత్య కేసులు నమోదవడంతో ఈ ఘటన స్థానికుల్లో కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. దర్యాప్తు జరుపుతున్నారని తెలిపారు. ఈ షాకింగ్ ఘటన సమాచారం అందిన వేంటనే జిల్లా ఎస్పీ బృందం మరియు ఫోరెన్సిక్ నిపుణులతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. సాక్ష్యాధారాలను సేకరిస్తున్నారు. స్థానికుల నుంచి కూడా ఈ ఘటన గురించి ఆరా తీస్తున్నారు.
ఈ ఘటనపై ADG ప్రశాంత్ కుమార్ స్పందించారు. ఇది చాలా తీవ్రమైన నేరమని అన్నారు. "ఈ సంఘటన చాలా తీవ్రమైనది. STF బృందాన్ని సంఘటనా స్థలానికి పంపారు. ఈ సంఘటన వెనుక ఉద్దేశం ప్రాథమిక దర్యాప్తు తర్వాత వెల్లడి అవుతుంది" అని ఉత్తరప్రదేశ్, లా & ఆర్డర్ ADG ప్రశాంత్ కుమార్ తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లో ఉక్కపోత, వేసవి కాలం కావడంతో కుటుంబసభ్యులంతా ఇంటి ప్రాంగణంలో నిద్రిస్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తులు వారిపై దాడికి పాల్పడ్డారు. వీరందరిపై పదునైన ఆయుధాలతో దాడి చేసి హత్య చేసిన గుర్తులు కనిపించాయి. ఆపై ఇంటికి నిప్పు పెట్లారు. మృతుల ఇంటి నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా ఐదుగురు వ్యక్తులు దారుణంగా హత్యకు గురైనట్టు గుర్తించారు. పోలీసులు విచారణ ప్రారంభించినా హత్యకు గల కారణాలను మాత్రం ఇంకా నిర్ధారించలేకపోయారు.
కాగా, ప్రయాగ్‌రాజ్‌లో దారుణమైన సామూహిక హత్యలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గత వారం నగరంలోని నవాబ్‌గంజ్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని కత్తితో పొడిచి చంపారు. ఈ ఘటన తర్వాత ప్రయాగ్‌రాజ్ లోని సోరన్వ్ లో మరో ఇద్దరు వ్యక్తుల హత్యగు గురయ్యారు. ఈ కేసులను పోలీసులు ఇంకా విచారిస్తున్నారు.