రెండున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య.. దోషికి మరణ శిక్ష

Published : Jan 22, 2021, 08:53 AM IST
రెండున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య.. దోషికి మరణ శిక్ష

సారాంశం

గతేడాది అక్టోబరు 19న రోడ్డు పక్కన రెండున్నరేళ్ల చిన్నారి మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టంలో దారుణ విషయం బయటపడింది. ఆమెపై అత్యాచారం చేసి ఆపై దారుణంగా చంపేసినట్టు వెల్లడైంది.

రెండున్నరేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి దారుణానికి ఒడిగడ్డాడు. అభం, శుభం తెలియని పసిదానిపై అత్యాచారానికి పాల్పడి.. అనంతరం అతి కిరాతకంగా హత్య చేశాడు. కాగా.. నిందితుడికి న్యాయస్థానం మరణ శిక్ష విధించింది.

విచారణ ప్రారంభించిన 29 రోజుల్లో నే నిందితుడిని దోషిగా తేల్చిన కోర్టు.. మరణశిక్ష విధించి రికార్డు సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని కవి నగర్ ప్రాంతంలో గతేడాది అక్టోబరు 19న రోడ్డు పక్కన రెండున్నరేళ్ల చిన్నారి మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టంలో దారుణ విషయం బయటపడింది. ఆమెపై అత్యాచారం చేసి ఆపై దారుణంగా చంపేసినట్టు వెల్లడైంది.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ను కుదిపేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలిక తండ్రి స్నేహితుడైన చందన్‌ను అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు. డిసెంబరు 29న చార్జిషీటు సమర్పించారు. కేసును విచారించిన న్యాయమూర్తి మహేంద్ర శ్రీవాస్తవ ఆధ్వర్యంలోని స్పెషల్ పోక్సో బెంచ్ నిందితుడు చందన్‌ను దోషిగా తేల్చి గురువారం మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.  

PREV
click me!

Recommended Stories

Nepal flash flood | నేపాల్‌లో వరద బీభత్సం వందల మంది గల్లంతు | Trishuli River Flood
దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు | Best Prime Minister of India | Best CM