హర్యానా హోటల్లో వికాస్ దూబే: యుపిలో అనుచరుడి కాల్చివేత

Published : Jul 08, 2020, 07:48 AM ISTUpdated : Jul 08, 2020, 08:00 AM IST
హర్యానా హోటల్లో వికాస్ దూబే: యుపిలో అనుచరుడి కాల్చివేత

సారాంశం

ఎనిమిది మంది పోలీసులను హత్య చేసిన యుపీ గ్యాంగస్టర్ వికాస్ దూబే అనుచరుడు అమర్ దూబే పోలీసు కాల్పుల్లో మరణించాడు. యుపీలోని హమీర్ పూర్ జిల్లాలో ఎదురు కాల్పులు జరిగాయి.

లక్నో: ఉత్తరప్రదేశ్ గ్యాంగస్టర్ వికాస్ దూబే సహాయకుడు పోలీసు కాల్పుల్లో మరణించాడు. గత వారం జరిగిన ఎనిమిది పోలీసులు హత్య కేసులో వికాస్ దూబే ప్రధాన నిందితుడు. 

వికాస్ దూబే ముఠాలో షూటర్ అయిన అమర్ దూబే బుధవారం ఉదయం పోలీసు కాల్పుల్లో మరణించాడు. పోలీసులపై జరిగిన మెరుపుదాడిలో ఇతను కూడా పాల్గొన్నాడు. 

లక్నోకు 150 కిలోమీటర్ల దూరంలో హమీర్ పూర్ జిల్లాలో ఉత్తరప్రదేశ్ స్పషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) తో జరిగిన ఎదురుకాల్పుల్లో అతను మరణించాడు.

వికాస్ దూబే మంగళవారంనాడు హర్యానాలోని ఫరీదాబాదు గల ఓ హోటల్లో కనిపించినట్లు తెలుస్తోంది. ఫరీదాబాద్ హోటల్ పై పోలీసులు దాడి చేసి ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అయితే, వికాస్ దూబే తప్పించుకుని పారిపోయాడు. దాంతో ఢిల్లీకి సమీపంలో గల ఫరీదాబాద్, గుర్గావ్ నగరాల్లో అప్రమత్తం చేశారు. ఢిల్లీ పోలీసులను కూడా అప్రమత్తం చేశారు. 

PREV
click me!

Recommended Stories

Aadhaar Card New Rules : 2026లో ఆధార్ అప్‌డేట్ చేయాలంటే ఈ పత్రాలు తప్పనిసరి !
Jobs : కేవలం జనవరి ఒక్క నెలలోనే.. లక్ష ఉద్యోగాల భర్తీకి సర్కార్ సిద్దం