UP Elections 2022 : నకిలీ సమాజ్ వాదీల రాజవంశ విధానాలు అభివృద్ధిని అడ్డుకున్నాయి - ప్ర‌ధాని మోడీ

Published : Feb 07, 2022, 02:09 PM IST
UP Elections 2022 : నకిలీ సమాజ్ వాదీల రాజవంశ విధానాలు అభివృద్ధిని అడ్డుకున్నాయి - ప్ర‌ధాని మోడీ

సారాంశం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని బీజేపీ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గత ప్రభుత్వాలు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నాయని చెప్పారు. సోమవారం యూపీ ఓటర్లను ఉద్దేశించి ప్రధాని వర్చువల్ గా ప్రసంగించారు. 

UP Election News 2022 : యూపీ అసెంబ్లీకి ఎన్నిక‌లు దగ్గరకు వచ్చేశాయి. ఈ నేప‌థ్యంలో సోమవారం ఉద‌యం ఉత్త‌ర్ ప్ర‌దేశ్ కు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ (prime minister narendra modi) ప్ర‌చారం కోసం చేరుకున్నారు. అయితే మొదట 21 నియోజకవర్గాల నుండి పార్టీ కార్యకర్తల కోసం ఏర్పాటు చేసిన స‌భ‌లో ప్ర‌త్య‌క్షంగా పాల్గొనాల్సి ఉంది. కానీ వాతావ‌ర‌ణం అనుకూలించ‌క‌పోవ‌డంతో ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ అయ్యింది. దీంతో వ‌ర్చువ‌ల్ (vertual)గా మాట్లాడాల‌ని ప్ర‌ధాని నిర్ణ‌యించుకున్నారు. ప్ర‌ధాని ప్ర‌సంగం వినేందుకు యూపీ బీజేపీ 109 డివిజన్లలో భారీ ఎల్ఈడీ స్క్రీన్‌ (led screens)లను ఏర్పాటు చేసింది. 

యూపీ (up) ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌ధాని మాట్లాడుతూ.. బీజేపీ డబుల్ ఇంజన్ ప్ర‌భుత్వం వ‌ల్ల ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లో ఎంతో అభివృద్ధి జ‌రిగింద‌ని చెప్పారు. దేశానికి స్వాతంత్రం వ‌చ్చి 100 సంవత్సరాలు పూర్తి అయిన‌ప్పుడు యూపీ అభ‌వృద్ధి విజయగాథతో సిద్ధంగా ఉంటుందని తెలిపారు. ఉత్తరప్రదేశ్ కోసం మాకు భారీ ఆకాంక్షలు ఉన్నాయి అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ‘‘ యూపీ అభివృద్ధి నదిలో నీరు నిలిచిపోయింది. ఇది నకిలీ సమాజ్‌వాదీలు, వారి సన్నిహితుల మధ్య స్తబ్దుగా ఉంది. వీరికి సామాన్యుల అభివృద్ధి దాహం, ప్రగతి దాహంతో ఎప్పుడూ సంబంధం లేదు.’’ అని అన్నారు. 

మహిళలకు నిజమైన గౌరవాన్ని ఇచ్చాం.. 
ఎస్పీ- బీఎస్పీ ( SP-BSP ) తమ దాహార్తిని, వారి సన్నిహితుల దాహాన్ని తీర్చుకుంటూనే ఉన్నాయని ప్రధాని అన్నారు. ‘‘ఇంతకు ముందు మహిళలపై వేధింపులు చాలా సాధారణం. పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. చైన్ స్నాచింగ్ (chain snaching) సంఘటనల తర్వాత ప్రజలు ఇప్పటికీ జీవించి ఉన్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సీఎం యోగి ప్రభుత్వం ఆ భయం నుండి మహిళలకు విముక్తి కల్పించింది. మేము మహిళలకు నిజమైన గౌరవం ఇచ్చాము ’’ అని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ (yogi adhityanath) ప్రభుత్వంపై ఆయనకు ఉన్న విశ్వాసాన్ని పునరుద్ఘాటించిన ప్రధాని, యూపీలోని బీజేపీ ప్రభుత్వం ఎలాంటి వివ‌క్ష లేకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తోందని అన్నారు.మాఫియా రాజ్‌కు మద్దతు ఇచ్చార‌ని ఎస్పీ-బీఎస్పీ పాల‌న‌ను దూషిస్తూనే.. ఆదిత్యనాథ్ హయాంలో నేరస్తులే స్వయంగా జైళ్లకు పరిగెత్తారని, త‌మ‌ను లాక్కెళ్లాలని వారే డిమాండ్ చేశారని ప్రధాని అన్నారు. అయితే ఈ ఎన్నికల కోసం వారు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నామని తెలిపారు. ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వం మారితే జైళ్ల నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని వారికి ఒకే ఒక్క ఆశ ఉంద‌ని చెప్పారు. 

బీజేపీ వ్యాక్సిన్ అని విమ‌ర్శించిన వారికి బుద్ది చెప్పాలి - యోగి
ప్రధాని నరేంద్ర మోడీ మార్గదర్శకత్వంలో భారతదేశంలో తయారు చేసిన వ్యాక్సిన్ ప్రపంచంలోనే ఉత్తమ వ్యాక్సిన్ అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (yogi adhityanath) సోమవారం అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌ (bignor)లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి యోగి మాట్లాడారు. కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ‘ బీజేపీ వ్యాక్సిన్’ (bjp vaccine) అని విమ‌ర్శించిన వారికి ఇప్పుడు ఓట‌ర్లు బుద్ది చెపాల్సిన స‌మ‌యం వ‌చ్చింద‌ని తెలిపారు. వారిని ఓట‌ర్లు తిర‌స్క‌రించాల‌ని సూచించారు.  బీజేపీ ‘డబుల్ ఇంజిన్’ ప్రభుత్వానికి ఓటు వేయాలని ఓటర్లను కోరారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

వీడు మామూలోడు కాదు.. ఫిట్ నెస్ కా బాప్ బాబా రాందేవ్ నే చిత్తుచేసిన తోపు..! (Viral Video)
IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !