
UP Election News 2022 : ఉత్తరప్రదేశ్ (utharapradhesh) ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పార్టీల్లో నాయకుల మార్పులు చేర్పులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సారి రెండు ముఖ్య పార్టీల నుంచి సీఎం రేసులో ఉన్న అభ్యర్థులు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటున్నారు. వీరు ఇంత వరకు ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు. శాసన మండలి ద్వారా అసెంబ్లీలో అడుగుపెట్టి రాష్ట్రాన్ని పాలించారు.
ఇదిలా ఉండగా.. ఉత్తరప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో 17 స్థానాలకు బీజేపీ (barathiya janatha party- bjp) మంగళవారం అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో లక్నో (lacknow) పరిధిలోని మొత్తం తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే ఈ జాబితాలో సమాజ్‌వాదీ పార్టీ (samajwadi party) అధినేత ములాయం సింగ్ యాదవ్ (mulayam singh yadav) కోడలు అపర్ణా యాదవ్ (aparna yadav), పార్టీ ఎంపీ రీటా బహుగుణ జోషి (reeta bahuguna jyoshi) కుమారుడు మయాంక్ జోషి (mayank jyoshi) పేరు లేకపోవడం ఆసక్తికరంగా మారింది.
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అపర్ణ యాదవ్ లేదా మయాంక్ జోషిని లక్నో కంటోన్మెంట్ స్థానం బీజేపీ రంగంలోకి దించుతారని వార్తలు వెలువడ్డాయి. అయితే ఇదే స్థానం నుంచి 2017లో జరిగిన ఎన్నికల్లో అప్పటి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి అపర్ణ యాదవ్ ను రీటా బహుగుణ ఓడించడం గమనార్హం. అయితే ఇప్పుడు లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి లక్నో (సెంట్రల్) ఎమ్మెల్యే, మంత్రి బ్రిజేష్ పాఠక్ (brijesh patak) ను బీజేపీ పోటీకి దింపింది.
కాగా, స్వచ్ఛంద పదవీ విరమణను ఎంచుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మాజీ అధికారి రాజేశ్వర్ సింగ్ (rajeshwar singh) సరోజినీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. మహిళా సంక్షేమ శాఖ సహాయ మంత్రి స్వాతి సింగ్ (swathi singh), ఆమె భర్త దయా శంకర్ సింగ్ (daya shankar singh) ఈ సీటుపై దృష్టి సారించినట్లు వార్తలు వచ్చాయి. అయితే బీజేపీ విడుదల చేసిన ఆశ్చర్యం రేకెత్తించింది. మరో మంత్రి అశుతోష్ టాండన్ (ashuthosh thandan) తన లక్నో తూర్పు స్థానం నుంచి పోటీ చేయనున్నారు. బీజేపీని వీడిన హృదయ్ నారాయణ్ దీక్షిత్ (hrudhay narayan) ఎమ్మెల్యేగా ఉన్న ఉన్నావ్ జిల్లాలోని భగవంత్‌నగర్ నుంచి అశుతోష్ శుక్లాకు (ashuthosh shukla) టికెట్ ఖరారు చేసింది.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 403 స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలకు మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.మొదటి దశ ఓటింగ్ ఫిబ్రవరి 10వ తేదీని నిర్వహించనున్నారు. రెండో దశ ఎన్నికలు ఫిబ్రవరి 14వ తేదీన, మూడో దశ ఎన్నికలు ఫిబ్రవరి 20వ తేదీన, నాలుగో దశ ఎన్నికలు ఫిబ్రవరి 23వ తేదీన, ఐదో దశ ఎన్నికలు ఫిబ్రవరి 27వ తేదీన, ఆరో దశ ఎన్నికలు మార్చి 3వ తేదీన, ఏడో దశ ఎన్నికలు మార్చి 7వ తేదీన చేపట్టనున్నట్టు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ ఏడు దశల్లో జరిగిన ఎన్నికల ఫలితాలను మార్చి 10వ తేదీన లెక్కిస్తారు. ప్రస్తుతం యూపీలో బీజేపీ అధికార పార్టీగా ఉండగా సమాజ్ వాదీ పార్టీ ప్రతిపక్ష హోదాలో ఉంది. ఈ సారి అధికారం చేపట్టాలని రెండు పార్టీలు తీవ్రంగా శ్రహిస్తున్నాయి.