
Up elections news 2022 : యూపీ (up) లో ఎన్నికల దగ్గరకొస్తున్నాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నాయి. తమ అభ్యర్థుల గెలుపుకోసం అన్ని పార్టీల ముఖ్య నాయకులు రంగంలోకి దిగుతున్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి తమ పార్టీకి ఓటు వేయాలని కోరుతున్నారు. ప్రచార సమయంలో ఓట్లరపై వరాల జల్లు కురిపిస్తున్నారు. తాము గెలిస్తే ఇది చేస్తామని, అది చేస్తామని ఊదరగొడుతున్నారు.
యూపీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా గురువారం సమాజ్ వాదీ పార్టీ (samajwadi party), కాంగ్రెస్ పార్టీ (congress party) గురువారం రోడ్ షో నిర్వహించాయి. అయితే ఈ క్రమంలో ఓ సన్నివేశం అందరి దృష్టిని ఆకర్శించింది. జహంగీరాబాద్ ప్రాంతంలో ఓ వైపు నుంచి అఖిలేష్ యాదవ్ (akhilesh yadav) ఓపెన్ కారు, మరో వైపు నుంచి ప్రియాంక గాంధీ (priyanka gandhi) ట్రాక్టర్ పై నుంచి వస్తూ ఎదురెదురుగా కలుసుకున్నారు. ఈ సమయంలో రెండు పార్టీల కార్యకర్తలు ఉత్సాహంగా కేకలు వేశారు. ఈ సమయంలో ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్ లు ఒకరికొకరు అభివాదం చేసుకున్నారు. ఈ సమయంలో అఖిలేష్ వెంట ఆర్ఎల్ డీ చీఫ్ జయంత్ చౌదరి (rld chief jayanth choudary) ఉన్నారు.
ఈ సన్నివేశాన్ని సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ట్విట్టర్ (twitter)లో పోస్ట్ చేస్తూ.. ‘‘ ఏక్ దువా సలామ్ ~ తెహజీబ్ కే నామ్’’ అని క్యాప్షన్ పెట్టారు. హుమారీ భీ ఆప్కో రామ్ రామ్ @జయంత్రల్ద్ యాదవఖిలేష్ అంటూ కాంగ్రెస్ నేత ట్విట్టర్‌లో ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు.
యూపీలో 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సమజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి పొత్తు పెట్టుకొని పోటీ చేశాయి. అయితే ఈ సారి విడివిడిగానే పోటీ చేస్తున్నాయి. కానీ ఓ రెండు స్థానాల విషయంలో మాత్రం అంతర్గతంగా ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఎందుంటే ఈ సారి మొదటి సారిగా అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్న కర్హల్ (karhal) నియోజకవర్గం, ఆయన మామ శివపాల్ సింగ్ యాదవ్ (shivapal singh yadav) పోటీ చేస్తున్న జస్వంత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టలేదు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో సోనియా గాంధీ (sonia gandhi), రాహుల్ గాంధీ (rahul gandhi) పోటీ చేసిన రాయ్ బరేలి, అమేథి లోక్ సభ నియోజకవర్గాల నుంచి సమాజ్ వాదీ పార్టీ కూడా అభ్యర్థులను నిలబెట్టలేదు. ఆ సమయంలో చేసిన సహాయానికి ప్రతిఫలంగా ఈ సారి కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టలేదని ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శి ప్రకాష్ ప్రధాన్ (prakash pradhan) స్పష్టం చేశారు.
అయితే యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ పోటీ చేయాలని నిర్ణయించుకుంటే అక్కడ సమాజ్ వాదీ పార్టీ తన అభ్యర్థిని వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. ఈ సారి అధికార బీజేపీ ఆర్ఎల్ డీతో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. సమాజ్ వాదీ పార్టీ, ఆర్ఎల్ డీ కలిసి యూపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి.