
ఉత్తరప్రదేశ్‌లో మరోసారి బీజేపీ అధికారం చేపట్టే దిశగా ముందుకు సాగుతుంది. భారీ ఆధిక్యంలో కొనసాగుతుంది. మరోసారి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath
) ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే యూపీ ఎన్నికల ఫలితాలను 7 నెలల క్రితమే Asianet న్యూస్ సర్వే నిర్వహించి అంచనా వేయగలిగింది. గతేడాది ఆగస్టులో Asianet News-Jan Ki Baat ఓటర్ల మూడు ఎలా ఉందని చేసిన సర్వే ద్వారా.. యోగి ఆదిత్యనాథ్ రెండోసారి ముఖ్యమంత్రిగా తిరిగి అధికారం చేపట్టనున్నారని అంచనా వేసింది. ఎన్నికలకు చాలా నెలల ముందు దేశంలో ఒక మీడియా సంస్థ చేసిన మొదటి ప్రజాభిప్రాయ సేకరణ ఇది. ఇందులో 51 శాతం మంది ఓటర్లు యోగి ఆదిత్యనాథ్‌ను ముఖ్యమంత్రి కోరుకున్నారు.
ఉత్తరప్రదేశ్ కాన్పూర్ బుందేల్‌ఖండ్, అవధ్, వెస్ట్, బ్రిజ్, కాశీ, గోరక్ష్‌లోని ఆరు ప్రాంతాలలో ఈ విస్తృతమైన సర్వే జరిగింది. 42 శాతం ఓట్లతో బీజేపీకి 222-260 సీట్లు వస్తాయని, ఎస్పీ 135 సీట్లు గెలుచుకుంటుందని సర్వే అంచనా వేసింది. ప్రస్తుత ఆధిక్యత ప్రకారం 263 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఇక, బీఎస్పీ సింగిల్ డిజిట్‌కు మాత్రమే పరిమితం అవుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత ట్రెండ్స్ బీఎస్పీ కేవలం 2 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉన్నాయని చూపిస్తున్నాయి.
అదేవిధంగా.. యూపీలో కాంగ్రెస్ పార్టీ దారుణమైన దుస్థితిని కూడా ఆసియానెట్ న్యూస్ అంచనా వేసింది. బీఎస్పీ మాదిరిగానే.. కాంగ్రెస్ కూడా సింగిల్ డిజిట్‌కు పరిమితం అవుతుందని.. ఏడు స్థానాల్లో మాత్రమే గెలుపొందగలదని మా సర్వేలో తేలింది. అయితే ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం కాంగ్రెస్ 2 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది.
మా సర్వేలో అఖిలేష్‌కు 38 శాతం మంది ఓటర్లు ప్రాధాన్యతనిచ్చారని, మాయావతికి కేవలం ఎనిమిది శాతం మంది మాత్రమే ప్రాధాన్యతనిచ్చారని తేలింది. ఇక, ప్రియాంక గాంధీ వాద్రాకు అత్యంత తక్కువగా 2 శాతం మద్దతు మాత్రమే లభించింది. ఇక, మోదీకి వ్యతిరేకంగా చేసే వ్యాఖ్యలు.. ఓటర్లను అతి తక్కువ ప్రభావం చేస్తాయని ఆసియానెట్ న్యూస్ సర్వే మొదట పేర్కొంది. లఖింపూర్ ఖేరీలో బీజేపీ విజయం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది. రాజకీయ విమర్శల కన్నా.. ప్రజలు ఎమనుకుంటున్నారనే దానికి ఈ ఫలితం ఆవిష్కరించింది.
సర్వేలో 20,000 మందికి పైగా మెజారిటీ ప్రజలు యోగి ఆదిత్యనాథ్‌కు రెండో సారి అధికారం చేపట్టడానికి ఇష్టపడుతున్నట్టుగా చెప్పారు. ముఖ్యంగా చట్టపరమైన పాలన, అవినీతి వ్యతిరేక పాలన కోరుతూ వారు ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. వాస్తవానికి.. అయోధ్యలో రామమందిర నిర్మాణంపై చేసిన వాగ్దానం కూడా యూపీలో యోగి నాయకత్వానికి ప్రజల మద్దతు తెలుపడానిక కారణంగా నిలిచింది.
ఏది ఏమైనప్పటికీ సర్వేలో పాల్గొన్న చాలా మంది.. ప్రధానంగా పశ్చిమ, అవధ్, కాన్పూర్ బుందేల్‌ఖండ్‌లలోని వారు అవినీతి నియంత్రణలో ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఇంకా చాలా చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. ‘యోగి నిజాయితీపరుడు.. కానీ అధికారులు అవినీతిపరులు’ అనే అభిప్రాయాన్ని వెల్లడించారు. కోవిడ్ ఎదుర్కొవడం యోగి విజయవంతం అయ్యారని సర్వే ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం మాకు తెలిసింది. సర్వేలో భాగంగా మా సర్వే బృందంతో మాట్లాడిన చాలా మంది.. కోవిడ్‌కు వ్యతిరేకంగా యోగి అనుసరించిన వ్యుహాలతో సంతృప్తి చెందినట్టుగా వెల్లడించారు.
అయితే ధరలపై నియంత్రణ సరిగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ ద్రవ్యోల్బణం అనేది కేవలం యూపీ ఒక్క రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాలేదని ప్రజలు గ్రహించినట్లు ఫలితాలు చూపిస్తున్నాయి. సాగు చట్టాలు, వాటికి వ్యతిరేకంగా ఆందోళనలు సాగినప్పటికీ.. వాటి ప్రభావం ఎక్కువగా పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో మాత్రమే ఉందని సర్వేలో తేలింది. అయితే మోదీ సర్కార్ వ్యవసాయ బిల్లును రద్దు చేయడంతో.. అక్కడి వారి ఆలోచనలో కూడా మార్పు కనిపిస్తోంది.
ఇక, ఆసక్తికర విషయం ఏమిటంటే.. 50 శాతం కంటే ఎక్కువ మంది వ్యవసాయ బిల్లును చదవలేదని లేదా అర్థం చేసుకోలేదని మా సర్వే బృందానికి చెప్పారు. దాదాపు 60 శాతం మందికి బిల్లుపై ఎలాంటి అభిప్రాయం లేదని తెలిపారు. ఈ సమాచారం ఆధారంగా సాగు చట్టాలు ఎన్నికల నాటి సమస్యగా ఉండబోదని ఆసియా నెట్ స్పష్టంగా పేర్కొంది. విద్యుత్ బిల్లు అంశాన్ని ప్రతిపక్షాలు లేవనెత్తినప్పటికీ.. సర్వేలో అభిప్రాయాలు వ్యక్తం చేసిన 70 శాతం మంది తమపై ప్రభావం చూపలేదని పేర్కొన్నారు.
మా సర్వేలో రాష్ట్రంలో కీలకంగా ఉన్న బ్రాహ్మణుల ఎటువైపు మొగ్గు చూపుతున్నారనే అంశాన్ని అధ్యయనం చేశాం. కాన్పూర్ బుందేల్‌ఖండ్‌లో 36 శాతం మంది తాము నిర్ణయించుకోలేదని చెప్పారు. అయితే మిగిలిన ప్రాంతాలు స్పష్టంగా బిజెపి వైపు మొగ్గు చూపాయి. ఎస్సీలలో జాతవ్, నాన్ జాతవ్‌ల అభిప్రాయాలు సేకరించగా.. వారు భిన్నమైన అభిప్రాయలు చెప్పారు. కానీ కచ్చితంగా బీజేపీ వైపు మొగ్గు కనిపించింది.
టిక్కెట్ల పంపిణీ తీరు కూడా బీజేపీకి అనుకూలంగా మారింది. కులాల సమతూకం, యాదవేతర OBCల అధిక పోలింగ్‌ను యోగి ఆదిత్యనాథ్‌కు అనుకూలంగా మారుతుందని ఆసియానెట్ న్యూస్ అంచనా వేసింది. ఎన్నికల్లో కొత్తవారికి అవకాశం కల్పించడం కూడా పట్ల కూడా సర్వేలో పాల్గొన్నవారిలో ఎక్కువ మంది ప్రాముఖ్యత ఇచ్చారు. 7 నెలల క్రితం సర్వేలు వెలువరించిన విషయాలు.. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాలను పోలి ఉండటం.. మా బ్రాండ్ విశ్వసనీయతను ధ్రువీకరిస్తున్నాయి.