
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీకి (bsp) ఓట్లు పడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (central home minister amith shah) అంగీకరించిన కొద్ది రోజుల తరువాత ఎస్‌బీఎస్పీ (Suheldev Bharatiya Samaj Party) చీఫ్ ఓం ప్రకాశ్ రాజ్‌భర్ (Om Prakash Rajbhar) బీజేపీ (bjp), బీఎస్పీ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఎన్నికల్లో మాయవతి బీజేపీకి సహాయం చేశారని అన్నారు. బీఎస్పీ అభ్యర్థులుగా ఎవరు పోటీ చేయాలనే విషయాన్ని అమిత్ షా తన గదిలో కూర్చొని నిర్ణయించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎస్‌బీఎస్పీ చీఫ్ ఓం ప్రకాశ్ రాజ్‌భర్ మంగళవారం ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. బీజేపీ, బీఎస్పీపై విమర్శలు ఎక్కుపెట్టారు. అధికారంలో ఉన్న కాషాయ పార్టీకి సహాయం చేయడమే లక్ష్యంగా బీఎస్పీ పని చేసిందని అన్నారు. కాషాయ పార్టీ నాయకులకు నాగ్ పూర్ లో అబద్దాలు నేర్చుకోవడంలో శిక్షణ పొందారని తెలిపారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (yogi adityanath)పై బుల్‌డోజర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘‘ తన బుల్‌డోజర్‌ను పోక్‌ల్యాండ్ (మెషిన్) మీద ఉంచి అతని ఇంటికి తిరిగి పంపుతాను ’’ అని అన్నారు.
2022లో జరుగుతున్న యూపీ ఎన్నికల్లో ఓటర్లు కాంగ్రెస్, బీఎస్పీ వంటి పార్టీలను కూడా పట్టించుకోవడం లేదని ఓం ప్రకాశ్ రాజ్‌భర్ అన్నారు. మాయావతి (mayavathi) పార్టీ యూపీ ఎన్నికలలో బీజేపీ ప్రభుత్వాన్ని చేసేందుకు సహాయపడేందుకు మాత్రమే పోటీ చేస్తుందని తెలిపారు. SP, రాష్ట్రీయ లోక్ దళ్, SBSP ఇతర కూటమి భాగస్వాములు బీజేపీని అధికారం నుంచి గద్దె దించుతాయని రాజ్‌భర్ విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ కేవలం ద్వేషాన్ని మాత్రమే వ్యాపింపజేస్తుందని ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ప్రజలు ఎలా చదువుకుంటారు, వారికి వారికి ఉపాధి ఎలా లభిస్తుందనే విషయంలో ఆ పార్టీ ఆలోచించడం లేదని తెలిపారు. యూపీ ఎన్నికల్లో బీజేపీతో తమకు పోటీ లేదని రాజ్ భర్ ధీమా వ్యక్తం చేశారు. ‘‘బల్లియా, మౌ, ఘాజీపూర్, అంబేద్కర్ నగర్, అజంగఢ్ వంటి ప్రాంతాల్లో బీజేపీ ఖాతా తెరవబోదని అన్నారు. నేని అన్ని మండలాల్లో తిరుగుతున్నానని, ప్రజలు మార్పు కోరకుంటున్నారని చెప్పారు.
యూపీలో ఇప్పటి వరకు ఐదు దశల్లో ఎన్నికలు ముగిశాయి. మరో రెండు దశల్లో ఎన్నికలు ముగిసి ఉన్నాయి. మార్చి 3వ తేదీన ఆరో దశ, మార్చి 7వ తేదీన ఏడో దశ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. 2017లో ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు సాధించి అధికారం ఏర్పాటు చేసింది. సీఎం బాధ్యతలను యోగి ఆదిత్యనాథ్ చేపట్టారు. అంతకు ముందు అఖిలేష్ యాదవ్ (akhilesh yadav) సీఎంగా ఉన్నారు. ఈ సారి అధికారం చేపట్టడానికి ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ (samajwadi party) తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బీజేపీ కూడా తిరిగి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పని చేస్తోంది. ఈ సారీ బీజేపీ, కాంగ్రెస్ (congress) ఒంటరిగానే పోటీ చేస్తున్నాయి. అయితే ఎస్పీ మాత్రం ఆర్ఎల్ డీ (RLD), ఎస్‌బీఎస్పీ (SBSP)తో పొత్తు పెట్టుకొని పోటీ చేస్తున్నారు.