UP Elections 2022: యూపీ ప్రచారంలో బీజేపీ జోరు.. వారణాసిలో అత్యాధునిక మీడియా సెంటర్..

By Sumanth KanukulaFirst Published Jan 25, 2022, 4:52 PM IST
Highlights

కరోనా వైరస్ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఆంక్షల మధ్య జరగనున్నాయి. ఈ క్రమంలోనే డిజిటల్ ప్రచారం వైపు పార్టీలు అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ Varanasiలో అత్యాధునిక మీడియా సెంటర్‌ను (media center) ఏర్పాటు చేస్తుంది. 

కరోనా వైరస్ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఆంక్షల మధ్య జరగనున్నాయి. ఈ క్రమంలోనే డిజిటల్ ప్రచారం వైపు పార్టీలు అడుగులు వేస్తున్నాయి. డిజిటల్ ప్రచారంలో అన్ని పార్టీల కంటే ఒక్క అడుగు ముందుండే బీజేపీ.. వారణాసి కంటోన్మెంట్ ప్రాంతంలోని హోటల్ డీ ప్యారిస్‌లో అత్యాధునిక మీడియా సెంటర్‌ను (media center) ఏర్పాటు చేస్తుంది. మీడియా సెంటర్‌కు సన్నాహాలు చివరి దశలో ఉన్నాయి. ఇక్కడి నుంచి పలు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ అత్యాధునిక మీడియా సెంటర్‌లో స్టూడియో, కంప్యూటర్స్, వై-ఫై, టీవీలు.. ఇతర సౌకర్యాలు ఉండనున్నాయి. కరోనా ఆంక్షల మధ్య ఈసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయని బీజేపీ కాశీ ప్రాంత అధ్యక్షుడు మహేష్ చంద్ శ్రీవాస్తవ (Mahesh Chand Srivastava) తెలిపారు. 

సోమవారం బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి కేకే శర్మతో కలిసి మహేష్‌ చంద్‌ శ్రీవాస్తవ ఈ మీడియా సెంటర్‌ను పరిశీలించారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో సమావేశమ్యారు. ఈ సందర్భంగా మహేష్ చంద్ర శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ఈసారి కరోనా కారణంగా అన్ని ఆంక్షల మధ్యే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను 100 శాతం పాటించాలి అన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందన్నారు. 

కాశీ ప్రాంత పరిధిలోకి వచ్చే శాసనసభ స్థానాలకు ఐదు, ఏడో దశలలో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా.. అందుకు తగ్గట్టు అన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందన్నారు. మీడియా సెంటర్‌ను వార్‌రూమ్‌ స్థాయిలో ఆధునీకరిస్తున్నామని మహేష్ చంద్ర తెలిపారు. ఈ మీడియా కేంద్రం కాశీ ప్రాంతంలోని 71 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పూర్వాంచల్‌లోని ఇతర అసెంబ్లీల ఎన్నికల సన్నాహాలను పర్యవేక్షిస్తుందని తెలియజేశారు. కాశీ ప్రాంతంలో రెండు మీడియా సెంటర్లను నిర్మిస్తున్నామని.. ఒకటి కాశీలో, మరొకటి ప్రయాగ్‌రాజ్‌లో సమీప జిల్లాల అసెంబ్లీ సన్నాహాలను పర్యవేక్షిస్తుందని చెప్పారు. మీడియా సెంటర్‌లో స్టూడియో కూడా ఏర్పాటు చేయాలని.. తద్వారా ఎలక్ట్రానిక్ మీడియాలో డిబేట్‌లు, ఇతర అవసరాల కోసం దానిని వినియోగించుకోవచ్చని సూచించారు. 

బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి KK Sharma మాట్లాడుతూ.. ‘కాశీ ప్రాంతంలోని మొత్తం 16 సంస్థాగత జిల్లాల మీడియా ఇన్‌ఛార్జ్‌లను ఈ మీడియా సెంటర్‌కు అనుసంధానం చేసి.. వారికి అవసరమైన మార్గదర్శకాలను కూడా ఎప్పటికప్పుడు జారీ చేస్తామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా సంక్షేమ పథకాలు, సాధించిన విజయాలను మీడియా సెంటర్‌లో పెద్ద పెద్ద హోర్డింగ్‌ల ద్వారా ప్రదర్శిస్తామని రాష్ట్ర co-media in-charge ధర్మేంద్ర సింగ్ తెలిపారు.

వార్‌రూమ్‌ తరహాలో మీడియా సెంటర్‌ను సిద్ధం చేస్తున్నామని.. ఇందులో టీవీ, వైఫై, ఇంటర్నెట్‌తోపాటు ల్యాప్‌టాప్, కంప్యూటర్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని ప్రాంతీయ మీడియా ఇన్‌ఛార్జ్ నవరతన్ రాఠీ (Navratan Rathi) తెలిపారు. 

click me!