
యూపీ (up) అసెంబ్లీకి మూడు దశల్లో ఎన్నికలు మగిశాయి. నాలుగో దశ ఎన్నికలు కూడా దగ్గరకు వచ్చేశాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని వేగంగా కొనసాగిస్తున్నాయి. పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాయి. గెలుపే లక్ష్యంగా పని చేస్తున్నాయి. యూపీలో మరో నాలుగు దశల్లో ఎన్నికలు మిగిలి ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో జరిగే ఎన్నికలు పార్టీల గెలుపోటములను నిర్ణయిస్తాయి.
యూపీ అసెంబ్లీ నాలుగో దశ ఎన్నికలకు ముందు కేంద్ర హోం మంత్రి అమిత్ షా (central home minister amith shah) ప్రయాగ్ రాజ్ (prayag raj)లో రోడ్ షో (road show) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఓ మీడియా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఉత్తరప్రదేశ్ (utharpradesh) లో బీజేపీ (bjp) మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదులపై నమోదైన అనేక తీవ్రమైన కేసుల్లో సమాజ్ వాదీ పార్టీ కోర్టును ఆశ్రయించిందని ఆరోపించారు.
మొదటి రెండు దశల పోలింగ్‌లోనే ఎస్పీ (samajwadi party) 'సెంచరీ' సాధించిందన్న అఖిలేష్ యాదవ్ (akhilesh yadav) వాదనను పక్కనపెట్టిన అమిత్ షా, రాష్ట్రాన్ని బీజేపీని నిలబెట్టుకోవాలని ఓటర్లను కోరారు. ఎస్పీ, బీఎస్పీ హయాంలో యూపీ టెర్రర్ హాట్‌స్పాట్, అల్లర్లకు కేంద్రంగా, మాఫియా కారిడార్‌గా ఉందని అన్నారు. మాఫియా కారిడార్ స్థానంలో బీజేపీ డిఫెన్స్ కారిడార్‌ను నిర్మిస్తోందని తెలిపారు. సోనియా-మన్మోహన్ ప్రభుత్వ హయాంలో ప్రతిరోజూ ‘ఆలియా, మాలియా, జమాలియా' లోపలికి ప్రవేశించి మన జవాన్ల తలలు నరికేవారు’ అని కేంద్ర హోం మంత్రి అని అన్నారు.
‘‘ బువా ఔర్ బాబూవా (అత్త-మేనల్లుడు) 15 సంవత్సరాలు యూపీని పాలించారు. కానీ పేదలకు మరుగుదొడ్లు కూడా నిర్మించలేదు. బీజేపీ 2.61 కోట్ల పేదల ఇళ్లకు మరుగుదొడ్లు నిర్మించింది’’ అని సమాజ్ వాదీ పార్టీ (samajwadi party), బహుజన్ సమాజ్ వాదీ (bahujan samajwadi party) పార్టీని ఉద్దేశించి అమిత్ షా అన్నారు. ఇదిలా ఉండగా.. ప్రయాగ్ రాజ్ లో నిర్వహించిన ఈ రోడ్‌షోలో పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ప్రజలు బీజేపీ జెండాలను ఎగురవేయడంతో పాటు వాహనాల కాన్వాయ్‌తో పాటు వీధుల గుండా కవాతు చేశారు. వీధులను కూడా బెలూన్లు, బీజేపీ బ్యానర్లతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య (keshav prasadh mourya) కూడా పాల్గొన్నారు. ఫిబ్రవరి 23వ తేదీన నాలుగో దశ ఎన్నికలు, 27వ తేదీన 5వ దవ ఎన్నికలు జరగనున్నాయి.
యూపీలో 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చింది. అంతకు ముందు రాష్ట్రంలో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ అధికారంలో ఉంది. 2017 ఎన్నికల తరువాత యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ (yogi adityanath) బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈ సారి కూడా అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. 2017లో పొగొట్టుకున్న అధికారాన్ని తిరిగి రాబట్టుకోవాలని సమాజ్ వాదీ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. కాంగ్రెస్, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ కూడా పోటీలో ఉన్నాయి. అయితే ప్రధాన పోటీ మాత్రం ఎస్పీ, బీజేపీల మధ్యే ఉండనుంది.