పరీక్షలో తప్పు చేశాడని దళిత బాలుడిని కొట్టి చంపిన ఉపాధ్యాయుడు.. యూపీలో దుర్ఘటన

By Mahesh KFirst Published Sep 26, 2022, 5:10 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌లో పదో తరగతి చదువుతున్న బాలుడు పరీక్షలో తప్పు చేశాడని ఓ ఉపాధ్యాయుడు తీవ్రంగా కొట్టాడు. ఆ దెబ్బల తర్వాత బాలుడి ఆరోగ్యం దారుణంగా క్షీణించింది. ఆ తర్వాత హా్స్పిటల్‌లో అడ్మిట్ చేశారు. కానీ, ఆ బాలుడు మరణించాడు.
 

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో మరో అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. ఓ దళిత బాలుడిని ఉపాధ్యాయుడు చితకబాదాడు. పరీక్షలో ఓ తప్పు చేశాడన్న కారణంగా ఉపాధ్యాయుడు విపరీతంగా కొట్టాడు. దీంతో ఆ బాలుడిని హాస్పిటల్‌లో అడ్మిట్ చేయాల్సి వచ్చింది. చికిత్స పొందుతూనే పరిస్థితులు విషమించి ఆ బాలుడు ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఔరియా జిల్లాలో చోటుచేసుకుంది.

నిఖిలో దోహ్రె పదో తరగతి విద్యార్థి. ఇటీవలే నిర్వహించిన ఓ పరీక్షలో నిఖిల్ తప్పు చేశాడు. దానిపై సోషల్ సైన్స్ టీచర్ అశ్విని సింగ్ ఫైర్ అయ్యాడు. ఈ నెల 7వ తేదీన నిఖిల్ దోహ్రెను విచక్షణా రహితంగా  దాడి చేశాడు. దీంతో ఆ పిల్లాడి ఆరోగ్యం క్షీణించింది. దీంతో నిఖిల్ దోహ్రెను హాస్పిటల్‌లో చేర్పించారు. ఆ ట్రీట్‌మెంట్ ఖర్చులకు సదరు ఉపాధ్యాయుడు కూడా కొన్ని డబ్బులు చెల్లించాడు. 

ఈ నెల 24వ తేదీన నిఖిల్ దోహ్రె తండ్రి రాజు దోహ్రె.. ఉపాధ్యాయుడు అశ్విని సింగ్ పై కేసు పెట్టాడు. తన కుమారుడి హాస్పిటల్ ట్రీట్‌మెంట్‌కు డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపించాడు. అదే విధంగా కులం పేరుతో దూషణలు చేశాడని పేర్కొన్నాడు. దీంతో అచ్ఛల్దా పోలీసు స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది.

చికిత్స పొందుతూనే నిఖిల్ దోహ్రే మరణించాడు. అచ్ఛల్డా పోలీసు స్టేషన్‌లో అశ్విని సింగ్ పై  కేసు నమోదైంది. అశ్విని సింగ్‌ను అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందం ఏర్పడింది. తాము ఎటావా అధికారులతో మాట్లాడినట్టు ఔరియా ఎస్పీ చారు నిగమ్ వివరించారు. ఆ బాలుడి మరణానికి గల కారణాలను తెలుసుకోవడానికి ఆ టీమ్ వీడియో గ్రాఫ్ తీయాలని ఆదేశించినట్టు తెలిపారు. ఆ తర్వాతి చర్యలకూ ఉపక్రమించామని చెప్పారు. నిందితుడిని అరెస్టు చేయడానికి మూడు బృందాలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు.

click me!