ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. మూడు నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో ప్రసంగించి ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు.
నాగ్‌పూర్. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అన్ని పార్టీల నాయకులు గెలుపు కోసం శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ తమ సీనియర్ నాయకులందరినీ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో నిమగ్నం చేసింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రెండు రోజులుగా మహారాష్ట్రలో వరుస బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ప్రతిపక్ష నాయకులపై విమర్శలు చేస్తూనే కేంద్రలోని మోదీ, రాష్ట్రంలోని షిండే ప్రభుత్వాల పనులను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అడుగుతున్నారు. ఇలా ఈరోజు (బుధవారం) కూడా సీఎం యోగి మూడు బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు.
సీఎం యోగి ఈరోజు మహారాష్ట్రలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. మొదటి సభ ఉదయమే కరంజా నియోజకవర్గంలో జరిగింది. ఇక మధ్యాహ్నం 2:50కి ఉల్హాస్‌నగర్ నియోజకవర్గంలో, చివరిగా 4:20 కి మీరా భయందర్ నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభల్లో యోగి పాల్గొంటాారు. .
undefined
నిన్న (మంగళవారం) కూడా యూపీ సీఎం మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు... మూడు ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. మొదట అచల్‌పూర్ నియోజకవర్గంలో, ఆ తర్వాత అకోలా పశ్చిమ నియోజకవర్గంలో పర్యటించారు. చివరిగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు మద్దతుగా నాగ్‌పూర్‌లో ప్రచారం చేశారు.