యూపీలో దేశంలోనే అతిపెద్ద ఫిలింసిటీ: యోగి ఆదిత్యనాథ్

By Siva KodatiFirst Published Sep 19, 2020, 2:32 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధానగర్‌లో దేశంలోనే అతిపెద్ద ఫిలింసిటీని నిర్మిస్తామన్నారు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఇందుకోసం నోయిడాలో అనువైన స్థలాన్ని చూసి ప్రణాళిక సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు

ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధానగర్‌లో దేశంలోనే అతిపెద్ద ఫిలింసిటీని నిర్మిస్తామన్నారు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఇందుకోసం నోయిడాలో అనువైన స్థలాన్ని చూసి ప్రణాళిక సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

ఘజియాబాద్, బులంద్‌షహర్, హాపూర్, బాగ్‌పట్, గౌతమ్ బుద్ధానగర్ జిల్లాలతో కూడిన మీరట్ డివిజన్ అభివృద్ధి ప్రాజెక్ట్‌లను యోగి సమీక్షించారు. అంతేకాకుండా నోయిడా కన్వెన్షన్ అండ్ హాబిటాట్ సెంటర్, గోల్ఫ్ కోర్సు, మెట్రో విస్తరణ, షూటింగ్ రేంజ్ వంటి ప్రాజెక్ట్‌ల పనులను వేగవంతం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

మొత్తంగా గౌతమ బుద్ధానగర్‌లో ఏడు ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయి. మీరట్‌లోని రింగ్ రోడ్ వద్ద ట్రాఫిక్‌ను తగ్గిస్తాయని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.  మెట్రో ప్రాజెక్ట్‌ను సైతం 2025 మార్చిలోగా పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

అభివృద్ధి పనుల్లో జాప్యం సహించమని, నాణ్యతా ప్రమాణాలకు కట్టుబడి సకాలంలో ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయాలని యోగి పేర్కొన్నారు. నిధుల దుర్వినియోగం చేస్తూ అక్రమాలకు పాల్పడితే దోషుల ఆస్తుల స్వాధీనం చేసుకోవడంతో పాటు కఠినచర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. 

click me!