గురు దక్షిణగా.. రోడ్డు వేయించిన యోగి ఆధిత్యనాధ్

First Published Jul 13, 2018, 3:47 PM IST
Highlights

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వినూత్నమైన కార్యక్రమాలతో దేశప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. తాజాగా తనకు చిన్నప్పుడు విద్యాబుద్ధులు నేర్పిన గురువుగారికి గురుదక్షిణగా చిరకాలం గుర్తుండిపోయే జ్ఞాపకాన్ని అందించారు

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వినూత్నమైన కార్యక్రమాలతో దేశప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. తాజాగా తనకు చిన్నప్పుడు విద్యాబుద్ధులు నేర్పిన గురువుగారికి గురుదక్షిణగా చిరకాలం గుర్తుండిపోయే జ్ఞాపకాన్ని అందించారు. యోగి ఆదిత్యనాథ్ ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో బాజ్‌పాయ్ అనే లెక్చరర్ ఆయనకు గణితం బోధించేవారు. తన శిష్యుడు రాష్ట్రానికి అధినేత కావడంతో ఎంతో సంతోషించారు.

ఈ క్రమంలో కాన్పూర్ వచ్చిన ముఖ్యమంత్రిని బాజ్‌పాయ్ కలుసుకున్నారు. తన గురువు రాకతో ఎంతో సంతోషించారు యోగి.. ఈ సమయంలో షాలెంపూర్ నుంచి ఖోజావ్‌పూర్ వరకు గతుకులమయంగా ఉన్న రోడ్డును పునర్మించాలని బాజ్‌పాయ్ సీఎంని కోరారు.. తన గురువు అడిగితే కాదనని ముఖ్యమంత్రి అప్పటికప్పుడే ఆ రోడ్డు పనులను ప్రారంభించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. తన శిష్యుడు తన మాటను కాదనకుండా రోడ్డును వేయిస్తుండటంతో బాజ్‌పాయ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ గురుదక్షిణ ఇప్పుడు  రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది.

click me!