డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) రూపొందించిన రెండు అతి స్వల్ప శ్రేణి క్షిపణులు (వేరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (VSHORADS) విజయవంతంగా పరీక్షించబడ్డాయి.
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) అభివృద్ధి చేసిన రెండు అతి స్వల్ప శ్రేణి క్షిపణులు(వేరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (VSHORADS) మంగళవారం విజయవంతంగా పరీక్షించింది.
భూ ఉపరితలం తక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలిగే ఈ క్షిపణులను ఒడిశాలోని చాందీపూర్ వద్ద DRDO యొక్క ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) వద్ద భూమి ఆధారిత పోర్టబుల్ లాంచర్ నుండి మంగళవారం ప్రయోగించినట్టు డీఆర్డీవో ఒక ప్రకటనలో తెలిపింది. ఈ క్షిపణి మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (MANPAD) ఇతర DRDO సౌకర్యాలు, వివిధ భారతీయ పరిశ్రమ భాగస్వాముల సహకారంతో DRDO యొక్క రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI), హైదరాబాద్ ద్వారా స్వదేశీంగా రూపొందించి.. అభివృద్ధి చేయబడింది.
రక్షణ మంత్రిత్వ శాఖ నుండి విడుదలైన ఒక పత్రికా ప్రకటనలో లాంచర్‌తో సహా క్షిపణి రూపకల్పన సులభంగా పోర్టబిలిటీని నిర్ధారించడానికి అత్యంత ఆప్టిమైజ్ చేయబడిందనీ, రెండు విమాన పరీక్షలు మిషన్ లక్ష్యాలను పూర్తిగా చేరుకున్నాయని పేర్కొంది.
వాయు రక్షణ క్షిపణిలో సూక్ష్మీకరించిన రియాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (RCS), ఇంటిగ్రేటెడ్ ఏవియానిక్స్ వంటి అనేక కొత్త సాంకేతికతలు ఉన్నాయి, వీటిని ట్రయల్స్ సమయంలో విజయవంతంగా పరీక్షించినట్లు అధికారులు తెలిపారు. క్షిపణిని తక్కువ ఎత్తులో ఉన్న వైమానిక ప్రమాదాలను తక్కువ శ్రేణుల వద్ద తటస్థీకరించడానికి రూపొందించబడింది. డ్యూయల్ థ్రస్ట్ సాలిడ్ మోటారు ద్వారా నడపబడుతుంది.
ఈ ప్రయోగం విజయవంతం కావడంతో డీఆర్డీవో, పరిశ్రమ భాగస్వాముల ప్రయత్నాలను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. ఆధునిక సాంకేతికతలతో కూడిన ఈ కొత్త క్షిపణి సాయుధ దళాలకు మరింత సాంకేతిక ప్రోత్సాహాన్ని ఇస్తుందని MoD చెప్పారు. DRDO ఛైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ విజయవంతమైన పరీక్షలపై మొత్తం వీఎస్హెఛ్ఓఆర్ఏడీఎస్(VSHORADS) బృందాన్ని అభినందించారు.
| DRDO (Defence Research and Development Organisation) conducted two successful test flights of Very Short Range Air Defence System (VSHORADS) missile on 27 Sep 2022 from a ground-based portable launcher from Integrated Test Range, Chandipur, off the coast of Odisha. pic.twitter.com/UFynnRMgGd
— ANI (@ANI)