కష్టాలను ఎదుర్కొని తిరిగొస్తారు: ఉన్నావ్ నిందితుడికి ఎమ్మెల్యే మద్ధతు

By Siva KodatiFirst Published Aug 3, 2019, 11:55 AM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌కు చెందిన భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు అశీశ్ సింగ్ ఆశు ఉన్నావ్ సమీపంలోని ఓ గ్రామంలో జరిగిన సభలో మాట్లాడుతూ...  సోదరుడు కుల్‌దీప్ సింగ్ ప్రస్తుతం విపత్కర పరిస్థితుల్లో ఉన్నారని.. మన మద్ధతు ఎప్పుడూ ఆయనకు ఉంటుందని వ్యాఖ్యానించారు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార ఘటనలో నిందితుడి వున్న బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్‌సింగ్‌కు మద్దతుగా మాట్లాడి మరో బీజేపీ ఎమ్మెల్యే చిక్కుల్లో పడ్డారు.

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు అశీశ్ సింగ్ ఆశు ఉన్నావ్ సమీపంలోని ఓ గ్రామంలో జరిగిన సభలో మాట్లాడుతూ...  సోదరుడు కుల్‌దీప్ సింగ్ ప్రస్తుతం విపత్కర పరిస్థితుల్లో ఉన్నారని.. మన మద్ధతు ఎప్పుడూ ఆయనకు ఉంటుందని వ్యాఖ్యానించారు.

కుల్‌దీప్ అన్ని అడ్డంకులను దాటుకుని త్వరలోనే మన మధ్యకు వస్తారని ఆశిస్తున్నాట్లు అశీష్ తెలిపారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నారు. నేరపూరిత కేసులో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తికి అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్యే మద్ధతుగా నిలవడం ఏంటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

కాగా.. ఉన్నావ్ అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్న కుల్‌దీప్‌సింగ్.. బాధితురాలు, వారి కుటుంబసభ్యులను హత్య చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో 45 రోజుల్లో అత్యాచార కేసు, రోడ్డు ప్రమాద కేసును విచారించాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. 

ఉన్నావ్ బాధితురాలి కేసు: బీజేపీ ఎమ్మెల్యే కుల్ దీప్ సెంగార్ బహిష్కరణ
 

click me!