యూపీలో ఇద్దరు ఆల్‌ఖైదా ఉగ్రవాదుల అరెస్ట్: భారీగా పేలుడు పదార్ధాలు సీజ్

By narsimha lodeFirst Published Jul 11, 2021, 4:48 PM IST
Highlights

యూపీలో ఇద్దరు ఆల్ ఖైదా తీవ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవలనే యూపీలో దర్బాంగాలో పేలుడుకు సంబంధం ఉన్న లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.  నిందితులను పోలీసులు విచారిస్తున్నారు.

లక్నో:ఇద్దరు ఆల్‌ఖైదా ఉగ్రవాదులను  యూపీకి చెందిన ఏటీఎస్  పోలీసులు ఆదివారం నాడు అరెస్ట్ చేశారు.ఆల్‌ఖైదా ఉగ్రవాదుల వద్ద నుండి ప్రెషర్ కుక్కర్ బాంబులతో పాటు భారీగా పేలుడు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.యూపీలో పెద్ద ఎత్తున పేలుళ్లకు ఉగ్రవాదులు  ప్లాన్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. యూపీలోని కకోరి ప్రాంతంలోని 50 మంది ఏటీఎస్ పోలీసులు  ఇద్దరు ఆల్ ఖైదా ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. 

ఏటీఎస్  ఐజీ జీకే గోస్వామి నేతృత్వంలోని బృందం ఓ ఇంట్లో ఇద్దరిని అరెస్ట్ చేసింది. వసీం అనే వ్యక్తి 15 ఏళ్లుగా స్థానికంగా నివాసం ఉంటున్నారు.  ఇదే ఇంట్లో మోటార్ గ్యారేజీ ఉంది.మోటార్ గ్యారేజీని బాంబుల తయారీ కోసం ఉపయోగిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.నిందితుడి ఇంటి నుండి  ప్రెషర్ కుక్కర్ బాంబులతో పాటు ఒక డిటోనేటర్,  7 కిలోల పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకొన్నారు.

అరెస్టైన వారి పేర్లను విచారణ తర్వాత వెల్లడిస్తామని ఐజీ తెలిపారు. లక్నోలో బీజేపీ ఎంపీతో పాటు కొందరు బీజేపీ నేతలను ఉగ్రవాదులు టార్గెట్ చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రాథమిక విచారణలో ఈ విషయ,మై ఉగ్రవాదులు ఒప్పుకొన్నారన్నారన్నారు.

click me!