దిగొచ్చిన ట్విట్టర్: గ్రీవెన్స్ ఆఫీసర్ నియామకం

By narsimha lodeFirst Published Jul 11, 2021, 3:18 PM IST
Highlights


కేంద్రం, ట్విట్టర్ మధ్య  ఇటీవల కాలంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. కేంద్రం తీసుకొచ్చిన ఐటీ రూల్స్ పాటించడంలో  ట్విట్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. నూతన ఐటీ రూల్స్ పాటించడంలో భాగంగా గ్రీవెన్స్ అధికారిని ట్విట్టర్ నియమించింది.ఈ విషయాన్ని  తమ సైట్‌లో ప్రకటించింది.
 


న్యూఢిల్లీ: ట్విట్టర్ ఎట్టకేలకు దిగొచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఐటీ రూల్స్ ను అమలు చేసే దిశగా చర్యలను తీసుకొంటుంది. ఈ మేరకు ఆదివారం నాడు ఇండియాలో రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారి(ఆర్‌జీఓ) ని నియమించింది ట్వట్టర్.ఇండియాకు చెందిన వినయ్ ప్రకాష్ కు ఆర్జీఓ బాధ్యతలను కట్టబెట్టింది.ఈ మేరకు ట్విట్టర్ లో  ఈ విషయాన్ని  ట్వీట్ చేసింది. ఏవైనా ఫిర్యాదులుంటే ట్విట్టర్ లో పేర్కొన్న మెయిల్ కు చేయాలని ఆయన కోరారు.

also read:కొత్త ప్రైవసీ విధానాలను బలవంతంగా రుద్దం: ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన వాట్సాప్​

గత కొన్ని రోజులుగా నూతన ఐటీ నిబంధనల విషయంలో కేంద్ర ప్రభుత్వం, ట్విట్టర్ మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకొంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఐటీ రూల్స్ ను పాటించడంలో  ట్విట్టర్  నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కేంద్రం విమర్శించింది.ఢిల్లీ హైకోర్టులో కేంద్రం ఇటీవలనే అఫిడవిట్ దాఖలు చేసింది.అధికారుల నియామకంలో జాప్యం వద్దని హైకోర్టు ట్విట్టర్ ను ఆదేశించింది.  తమకు ఈ విషయమై 8 వారాల సమయం కావాలని హైకోర్టును కోరింది.

click me!