up assembly election 2022 : యూపీ ఎన్నికల కోసం కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా రిలీజ్

By team teluguFirst Published Jan 20, 2022, 1:33 PM IST
Highlights

యూపీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల రెండో లిస్ట్ ను గురువారం విడుదల చేసింది. ఇందులో మొత్తం 41 మంది అభ్యర్థులు ఉండగా.. 16 మంది మహిళలు ఉన్నారు. యూపీ ఎన్నికల్లో 40 శాతం సీట్లు మహిళలకు కేటాయిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. 

ఉత్తరప్రదేశ్ (uthara pradhesh) అసెంబ్లీ ఎన్నికల కోసం 41 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను కాంగ్రెస్ (congress) గురువారం విడుదల చేసింది. ఇందులో 16 మంది మహిళా అభ్య‌ర్థులు ఉన్నారు. గ‌తంలోనే ఉత్త‌ర ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో 40 శాతం సీట్లు మ‌హిళ‌లకు కేటాయిస్తామ‌ని హామీ ఇచ్చింది. అందులో భాగంగానే రెండో విడ‌త జాబితాలో 16 మంది మ‌హిళ‌ల‌కు చోటు క‌ల్పించింది. కాంగ్రెస్ నేడు విడుద‌ల చేసిన జాబితాలో సహరాన్‌పూర్‌ నుంచి సుఖ్‌విందర్‌ కౌర్‌ (sukhvindar kour), సయానా నుంచి రైతు నాయకురాలు పూనమ్‌ పండిట్‌ (punam pandith), చార్తావాల్‌ నుంచి డాక్టర్‌ యాస్మీన్‌ రాణా (doctor yasmin rana) మహిళా అభ్యర్థుల్లో ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీ గ‌తంలో 125 మంది అభ్యర్థుల పేర్లను ప్ర‌క‌టించింది. ఇందులో 50 మంది మహిళలు ఉన్నారు. పార్టీ అభ్యర్థులుగా భిన్న నేపథ్యాలకు చెందిన మహిళలు ఎంపికయ్యారు. వారిలో ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లి, ఆశా వర్కర్ పూనమ్ పాండే (punam pande), జర్నలిస్ట్ నిదా అహ్మద్ (journlist nidha ahmad), సీఏఏ (CAA) వ్యతిరేక నిరసనల్లో ముందంజలో ఉన్న లక్నో(lacnow)కు చెందిన సామాజిక కార్యకర్త సదాఫ్ జాఫర్ (sadhaf jhafar)ఉన్నారు. 

గతంలో 40 శాతం టిక్కెట్లు మహిళలకే ఇస్తామని చెప్పిన ప్రియాంక.. ‘లడ్కీ హూన్, లడ్ సక్తి హూన్’ అంటూ నినాదాలు చేశారు. ‘‘హక్కుల కోసం పోరాడుతున్న ప్రజలకు మేము ఒక అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాం. ఇలా చేయడం వల్ల వారి ప్రయోజనాల కోసం పోరాడే నిజమైన అవకాశం ప్రజలకు లభిస్తుంది ’’ అని ప్రియాంక తెలిపారు. మహిళలకు రాజకీయ హక్కులు కల్పించాలని ఆమె అన్నారు. ఇదిలా ఉండ‌గా రాష్ట్రంలో రాజ‌కీయ కథనాన్ని మార్చడానికి పార్టీ ప్రయత్నించిందని కాంగ్రెస్ కు చెందిన ఓ నాయ‌కుడు చెప్పారు. అయితే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ‘లడ్కీ హూన్, లడ్ శక్తి హూన్’ కాంపెయిన్ లో ముందున్న ప్రియాంక మౌర్య బీజేపీలో చేరే అవ‌కాశం కనిపిస్తోంది. ఆమె బుధ‌వారం ల‌క్నోలోని బీజేపీ ప్ర‌ధాన కార్యాల‌యాన్ని సంద‌ర్శించింది. దీంతో ఆమె కాషాయ పార్టీలో చేర‌తార‌నే ఊహాగానాలు చెల‌రేగాయి. 

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో అసెంబ్లీలో  మొత్తం 403 సీట్లు ఉన్నాయి. అధికార పార్టీగా బీజేపీ (bjp), ప్ర‌తిప‌క్ష పార్టీగా స‌మాజ్ వాదీ (samajwadi) వ్య‌వ‌హరిస్తున్నాయి. ఇటీవ‌ల కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ ప్ర‌క‌టించిన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల షెడ్యుల్ లో భాగంగా యూపీలో కూడా ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దేశంలోనే అత్య‌ధిక అసెంబ్లీ స్థానాలు ఉన్నయూపీలో ఫిబ్ర‌వ‌రి 10వ (february) తేదీ నుంచి ఎన్నిక‌లు జ‌రగుతాయి. మొత్తం ఏడుద‌శల్లో ఈ ఎన్నిక‌లు జ‌రుగుతాయి. మొద‌టి ద‌శ ఫిబ్ర‌వ‌రి- 10, రెండో ద‌శ ఫిబ్ర‌వ‌రి - 14, మూడో ద‌శ ఫిబ్ర‌వ‌రి - 20, నాలుగో ద‌శ  ఫిబ్ర‌వ‌రి -23, ఐదో ద‌శ -27, ఆరో ద‌శ మ‌ర్చి -3, ఏడో ద‌శ మార్చి -7వ తేదీన జ‌ర‌గనున్నాయి. మార్చి 10వ తేదీన ఎన్నిక‌ల కౌంటింగ్ (counting) నిర్వ‌హిస్తారు. ఫ‌లితాలు అదే రోజు ప్ర‌క‌టిస్తారు. 

click me!