UP Assembly Election 2022: ఎన్నిక‌ల‌ ముందు యూపీ బీజేపీకి మరో షాక్.. !

By Mahesh RajamoniFirst Published Jan 24, 2022, 3:40 AM IST
Highlights

UP Assembly Election 2022: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. అయితే, ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ రాష్ట్ర బీజేపీకి షాక్ ల మీద షాక్ త‌గులుతూనే ఉన్నాయి. ఇప్ప‌టికే అసమ్మతినేతల తాకిడితో ఇబ్బందులు ప‌డుతున్న యూపీ బీజేపీకి.. మ‌రో దెబ్బ త‌గిలింది. ఫతేహాబాద్‌ ఎమ్మెల్యే జితేంద్ర వర్మ బీజేపీ గుడ్ బై చెప్పి.. స‌మాజ్ వాదీ పార్టీలో చేరారు. 

UP Assembly Election 2022: వ‌చ్చే నెల‌లో దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, మ‌ణిపూర్‌, గోవా, పంజాబ్‌, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాజ‌కీయాలు హీటు పెంచాయి. ఈ ఎన్నిక‌లు మినీ సంగ్రామాన్ని త‌ల‌పిస్తున్నాయి. మ‌రీ ముఖ్యంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ (Uttar Pradesh) లో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. అన్ని ప్ర‌ధాన పార్టీలు రాష్ట్రంలో ఎన్నిక‌ల ప్రచారాన్ని ముమ్మ‌రంగా కొన‌సాగిస్తున్నాయి. విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లతో విరుచుకుప‌డుతుండ‌టంతో యూపీ రాజ‌కీయాలు కాక రేపుతున్నాయి.  అయితే,  ఈ సారి జ‌ర‌గ‌నున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీకి వ‌రుస పెట్టి షాక్ ల మీద షాక్ లు త‌గులుతూనే ఉన్నాయి. 

ఇప్ప‌టికే యూపీ బీజేపీకి చెందిన కీల‌క‌నేత‌లు ఆ పార్టీ వీడి ఇత‌ర పార్టీల్లో చేరారు. ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్ది బీజేపీకి అస‌మ్మ‌తి సెగ‌లు మాత్రం త‌గ్గ‌డం లేదు.  తాజాగా ఆ క‌మ‌లానికి మ‌రో షాక్ త‌గిలింది. ఫతేహాబాద్ (Fatehabad) నియోజకవర్గంలోని బీజేపీ ఎమ్మెల్యే ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో కోపంతో ఫతేబాద్ ఎమ్మెల్యే జితేంద్ర వర్మ (fatehabad mla Jitendra varma) బీజేపీకి రాజీనామా చేశారు. అనంత‌రం ఆయ‌న అఖిలేష్ యాద‌వ్ నేతృత్వంలోని స‌మాజ్ వాదీ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా జితేంద్ర వ‌ర్మ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ కోసం తాను ఎంత‌గానో శ్ర‌మించాన‌నీ, అయినప్పటికీ, పార్టీలో తనకు సరియైన గుర్తింపులేదని ఆవేదన వ్యక్తం చేశారు. యువతను ప్రోత్సహిస్తామ‌ని చెప్పిన బీజేపీ.. ఆ తర్వాత కూడా 75 ఏండ్ల‌ వృద్ధుడికి టికెట్ ఇచ్చిందని ఆయ‌న (fatehabad mla Jitendra varma) ఆరోపించారు .

బీజేపీ పై విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే.. అఖిలేష్ యాద‌వ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ పై జితేంద్ర వ‌ర్మ (fatehabad mla Jitendra varma) ప్ర‌శంస‌లు కురింపించారు. త్వ‌ర‌లో జ‌ర‌గబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో స‌మాజ్‌వాదీ పార్టీ విజ‌యం సాధిస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. యూపీలో స‌మాజ్ వాదీ ప్ర‌భుత్వం ఏర్పాటు కానుందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అందరి సంక్షేమం కోసం తాము కృషి చేస్తామ‌ని వెల్ల‌డించారు. తాను బీజేపీకి గుడ్ చెప్ప‌డానికి టిక్కెట్ ద‌క్క‌క‌పోవ‌డ‌మే కార‌ణం కాద‌నీ, తాను  రాజీనామా చేయడానికి చాలా కారణాలున్నాయ‌ని ఆయ‌న తెలిపారు.  "నేనే కాదు, నాలాంటి ఎమ్మెల్యేలు చాలా మంది త్వరలోనే బీజేపీని వీడనున్నారు" అని ఆయ‌న (fatehabad mla Jitendra varma) అన్నారు. 

కాగా, గ‌తంలో సమాజ్ వాదీ పార్టీలోనే ఉన్న జితేంద్ర వ‌ర్మ‌.. 2017లో ఎస్పీని వీడి బీజేపీలో చేరారు. గత ఎన్నికల్లో బీజేపీ తరుఫున గెలిచిన ఆయన.. ప్ర‌స్తుతం మ‌ళ్లీ స‌మాజ్ వాదీ గూటికి చేరుకున్నారు. ఇదిలావుండ‌గా, యూపీలో బీజేపీని వీడుతున్న నేత‌ల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్ప‌టికే ఆ పార్టీకి చెందిన కీల‌క నేత‌లు కార్మిక, ఉపాధి శాఖ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి దారా సింగ్ చౌహాన్, ఆయుష్ మంత్రి (స్వతంత్ర బాధ్యతలు) ధరమ్ సింగ్ సైనీ స‌హా ప‌లువురు ఎమ్మెల్యేలు బీజేపీకి గుడ్ బై చెప్పారు. 
 

click me!