Rajasthan: దేశాన్ని త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీ : సీఎం అశోక్ గెహ్లాట్

By Mahesh RajamoniFirst Published Jan 24, 2022, 2:34 AM IST
Highlights

Rajasthan: ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలు చరిత్రను వక్రీకరించి దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయనీ, యువత చరిత్రను అధ్యయనం చేసి ఆలోచించాలని కాంగ్రెస్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీల సహకారం లేదని, ఎలాంటి త్యాగాలు వారు చేయలేదని తెలిపారు. ప్ర‌స్తుతం బీజేపీ-ఆర్ఎస్ఎస్‌లు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు.
 

Rajasthan: భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ)-కాంగ్రెస్ (Congress) ల మ‌ధ్య మాట‌యుద్ధం కొన‌సాగుతోంది. త్వ‌ర‌లో జ‌ర‌గనున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, పంజాబ్‌, ఉత్త‌రాఖండ్‌, మ‌ణిపూర్‌, గోవా ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆయా పార్టీల నేత‌లు ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లతో రెచ్చిపోతూ రాజ‌కీయాల‌ను హీటెక్కిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలపై కాంగ్రెస్ (Congress) సీనియ‌ర్ నేత, రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్ (Rajasthan Chief Minister Ashok Gehlot) తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలు (RSS-BJP) చ‌రిత్ర‌ను వక్రీకరించి దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. యువత చరిత్రను అధ్యయనం చేసి ఆలోచించి.. స‌రైన నిర్ణ‌యాల‌తో ముందుకు సాగాల‌ని అన్నారు. భారత స్వాతంత్య్ర పోరాటం (Indian independence movement)లో ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలది (RSS-BJP) ఎలాంటి సహకారం లేదని,  వారు ఎలాంటి త్యాగాలు  చేయలేదని అన్నారు. ప్ర‌స్తుతం ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలు  ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయ‌ని ఆరోపించారు.

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ (Netaji Subhash Chandra Bose) 125వ జ‌యంతి సంద‌ర్భంగా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్ (Rajasthan Chief Minister Ashok Gehlot) వ‌ర్చువ‌ల్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ పై వ్యాఖ్య‌లు చేశారు. "యువతను తప్పుదారి పట్టించడానికి వారికి (RSS-BJP) ఎలాంటి హక్కులు ఉన్నాయి? చరిత్రను వక్రీకరించడం మాత్రమే వారికి (ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలకు) తెలుసు" అని అన్నారు . "వారు ఎన్నడూ మహాత్మా గాంధీ  (Mahatma Gandhi)ని అంగీకరించలేదు. ఇప్పుడు వారి (ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ) అనుచ‌రులు గాంధీ ప్రాణాలు తీసిన (నాథూరాం) గాడ్సే (Nathuram Godse) విగ్రహాలను పూజిస్తున్నారు.. ప్రతిష్టిస్తున్నారు" అని విమ‌ర్శించారు.   ఈ సమావేశంలో ఆయన అశోక్ గెహ్లాట్ (Rajasthan Chief Minister Ashok Gehlot) బీజేపీ-ఆర్ఎస్ఎస్ (RSS-BJP)లను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. 

అలాగే, ఇటీవ‌ల కాంగ్రెస్ పై బీజేపీ (Bharatiya Janata Party) చేసిన ఆరోప‌ణ‌ల‌ను, విమ‌ర్శ‌ల‌ను సైతం అశోక్ గెహ్లాట్ (Rajasthan Chief Minister Ashok Gehlot) తిప్పికొట్టారు. స్వాతంత్య్రం వ‌చ్చిన 70 సంవ‌త్సరాల్లో కాంగ్రెస్ ఏమీ చేయ‌లేద‌న్న క‌థ‌నాన్ని ఆయ‌న వ్య‌తిరేకించారు. ‘‘దేశంలో జరిగిన అభివృద్ధి అంతా.. ఏడేళ్లలోనే జరిగిందా? అని ప్ర‌శ్నించారు. భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ మహాత్మాగాంధీ (Mahatma Gandhi), జవహర్‌లాల్ నెహ్రూ(Jawaharlal Nehru), సుభాష్ చంద్రబోస్ (Netaji Subhash Chandra Bose) స్వాతంత్య్ర ప్రయత్నాలను (Indian independence movement) సమర్థించారన్నారు. రాజకీయ పోరాటం భావజాలంతో ఉండాలని, అయితే స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా కులం, మతం ప్రాతిపదికన రాజకీయాలు జరగడం దురదృష్టకరమని గెహ్లాట్ అన్నారు. 

ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ  (RSS-BJP) లు చరిత్రను వక్రీకరించి దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. యువత చరిత్రను అధ్యయనం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌నీ, ఆ దిశ‌గా ముందుకు సాగాల‌ని అన్నారు. చ‌రిత్ర అధ్య‌నంతో ఆలోచించాలని, దేశ సంప్రదాయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. దేశంలో శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వ వాతావరణం నెలకొనాల‌ని ఆకాంక్షించారు. అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఆయ‌న‌ (Rajasthan Chief Minister Ashok Gehlot)  అభిప్రాయ‌ప‌డ్డారు. 

click me!