UP Assembly Election 2022 : యూపీ మంత్రిగా రాజీనామా చేసిన మ‌ర‌స‌టి రోజే మౌర్య పై అరెస్ట్ వారెంట్..

By team teluguFirst Published Jan 12, 2022, 9:09 PM IST
Highlights

యూపీ కేబినేట్ మినస్టర్ గా స్వామి ప్రసాద్ మౌర్య రాజీనామ చేసిన మరుసటి రోజే ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. 2014 సంవత్సరంలో ఆయనపై నమోదైన ఓ కేసులు బుధవారం ఆయన కోర్టుకు హాజరుకాకపోవడంతో కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 

ఎన్నిక‌లు ద‌గ్గర ప‌డుతున్న కొద్దీ ఉత్త‌ర్ ప్ర‌దేశ్ (uthara pradesh) రాజ‌కీయాల్లో ప‌రిణామాలు వేగంగా మారిపోతున్నాయి. యూపీలో సీఎం యోగి ఆధిత్య‌నాథ్ (cm yogi adithnadh)కేబినేట్ లో మంత్రిగా ఉన్న స్వామి ప్ర‌సాద్ మౌర్య (swamy prasad mourya)  మంగ‌ళ‌వారం త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు. అయితే ఆయ‌న స‌మాజ్ వాదీ పార్టీలో చేరుతార‌ని ప్ర‌చారం మొదలైంది. ఇంకా ఆ విష‌యంలో ఎలాంటి ఇంకా ఆయ‌న ఎలాంటి స్టెప్ తీసుకోలేదు. అయితే స‌రిగ్గా ఆయ‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామ చేసిన మ‌రుస‌టి రోజే స్వామి ప్ర‌సాద్ మౌర్య‌పై అరెస్ట్ వారెంట్ (arrest warent) జారీ అయ్యింది. ఇది రాజ‌కీయ వ‌ర్గాల్లో దుమారాన్ని రేపింది. 

హిందూ దేవుళ్ల‌పై అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశారంటూ స్వామి ప్ర‌సాద్ మౌర్య‌పై 2014లో కేసు న‌మోద‌య్యింది. అయితే ఈ కేసులో ఆయ‌న బుధ‌వారం కోర్టుకు హాజ‌రుకావాల్సి ఉంది. దీనికి హాజ‌రుకాక‌పోవ‌డంతో స్థానిక కోర్టు ఆయ‌న‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తదుప‌రి విచార‌ణ‌ను  జ‌న‌వ‌రి 24వ తేదీకి వాయిదా వేశారు. జ‌న‌వ‌రి 12వ తేదీన (బుధ‌వారం) స్వామి ప్రసాద్ మౌర్య కోర్టు ఎదుట హాజ‌రుకావాల‌ని జ‌న‌వరి 6వ తేదీన కోర్టు ఆదేశించింద‌ని, అయినా ఆయ‌న హాజ‌రుకాలేద‌ని లాయ‌ర్ అని తివారి తెలిపారు. 

స్వామి ప్ర‌సాద్ మౌర్య యూపీలో ప్ర‌భావంత‌మైన ఓబీసీ నాయ‌కుడు. కుషావా వర్గాల్లో ఆయ‌నకు అపారమైన పట్టు ఉంది. మౌర్య ప్ర‌స్తుతం బీజేపీ నుంచి ఆమె బదౌన్‌ నియోజకవర్గానికి  ఎమ్మెల్యేగా ఉన్నారు. యోగీ ఆధిత్య‌నాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్ర‌భుత్వంలో ఆయ‌న కేబినేట్ మిన‌స్ట‌ర్ గా ఉన్నారు. మంగ‌ళ‌వారం రోజు ఆయ‌న అనూహ్యంగా త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఇది రాష్ట్ర రాజ‌కీయాల్లో తుఫాను రేకెత్తించింది. ఈరోజు ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తాను బీజేపీని తిర‌స్క‌రించాన‌ని, తిరిగి ఆ పార్టీలోకి వెళ్లే ప్ర‌శ్నే లేద‌ని తేల్చి చెప్పారు. అయితే తాను ప్ర‌స్తుతానికి మంత్రి ప‌ద‌విని మాత్ర‌మే వ‌దులుకున్నాన‌ని, త్వ‌ర‌లోనే బీజేపీ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తాన‌ని తెలిపారు. ప్ర‌స్తుతానికి తాను సమాజ్‌వాదీ పార్టీలో చేరడం లేద‌ని స్ప‌ష్టం చేశారు. త‌న రాజీనామ బీజేపీని కుదిపేసింద‌ని అన్నారు. అయితే మౌర్య రాజీనామ చేసిన తరువాత కొంద‌రు సీనియ‌ర్ నాయ‌కులు ఆయ‌నతో ఫోన్ లో మాట్లాడారు. ఆయ‌నను తిరిగి బీజేపీలోకి తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ ఆ ప్ర‌య‌త్నాలేవీ స‌ఫ‌లం కాలేదు. 

మంగళవారం మౌర్య త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసిన వెంట‌నే సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ (cm akhilesh yadav) ఓ ట్విట్ చేశారు. మౌర్య ఉన్న ఫొటోను షేర్ చేస్తూ, ఆయ‌న స‌మాజ్ వాదీ పార్టీలో చేరుతార‌ని ట్వీట్ చేశారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల్లో భాగంగా యూపీలోనూ త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దేశంలోనే అత్య‌ధిక అసెంబ్లీ స్థానాలు ఉన్న బీజేపీలో ఫిబ్ర‌వ‌రి 10వ తేది నుంచి ఎన్నిక‌లు జ‌రగ‌నున్నాయి. మొత్తం ఏడుద‌శల్లో ఈ ఎన్నిక‌లు జ‌రుగుతాయి. మార్చి 10వ తేదీన ఓట్లు లెక్కింపు చేపట్టి ఫ‌లితాలు ప్ర‌క‌టిస్తారు. 

click me!