Coronavirus: త్వరలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ లో కరోనా మహమ్మారి కలకలం రేపుతున్నది. పార్లమెంట్ సిబ్బందిలో ఏకంగా 850 మంది కరోనా వైరస్ మహమ్మారి బారినపడటం ఆందోళన వ్యక్తమవుతున్నది. అటు జనవరి 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.
Coronavirus: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్నది. మరీ ముఖ్యంగా అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ వేరియంట్.. విజృంభిస్తున్నది. దీంతో చాలా దేశాల్లో కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య అధికంగా పెరుగుతున్నది. భారత్ లోనూ కరోనా వైరస్ (Coronavirus) పంజా విసురుతోంది. దీంతో కొత్త కేసులు నిత్యం లక్షల్లో నమోదవున్నాయి. దక్షిణాఫ్రికాలో మొదటగా వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు సైతం భారత్ లో పెరుగుతున్నాయి. అయితే, త్వరలోనే పార్లమెంట్ సమావేశాలు (Parliament Budget Session) నిర్వహించడానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఇలాంటి తరుణంలో పార్లమెంట్ లో కరోనా వైరస్ కలకలం రేపుతున్నది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 850 మంది పార్లమెంట్ సిబ్బందికి కరోనా వైరస్ సోకింది. పార్లమెంటులో కరోనా (Coronavirus) బారిన పడుతున్న సిబ్బంది సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. గత వారం నుంచి ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 850కి పెరిగింది. వీరిలో 250 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారని సమాచారం.
త్వరలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో పార్లమెంట్ సిబ్బంది అధికంగా కరోనా మహమ్మారి బారినపడుతుండటంపై పార్లమెంటు అధికారులు అప్రమత్తమయ్యారు. కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ.. సిబ్బందికి కీలక సూచనలు చేశారు. ఎలాంటి (Coronavirus) లక్షణాలు లేని వారే విధులకు హాజరుకావాలనీ, స్వల్ప లక్షణాలు ఉన్నా విధులకు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. కరోనా వైరస్ బారినపడ్డ వారిలో పలువురు హోం క్వారంటైన్ లో ఉండగా, మరికొంత మంది కోవిడ్ కేర్ కేంద్రాల్లో ఐసోలేషన్‌లో ఉన్నారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే, వీరందరికీ (Coronavirus) ఒమిక్రాన్ సోకిందా? అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. అటు జనవరి 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.
undefined
పార్లమెంట్ లో కరోనా పాజిటివ్ గా తేలిన సిబ్బందిని కలిసిన వారిలో కలవరం మొదలైంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఉన్నతాధికారులు సెల్ప్ క్వారంటైన్ లోకి వెళ్తున్నారు. ఇక మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగున్నాయ. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సిబ్బంది కరోనా బారినపడటం.. Parliament Budget Session సమావేశాలపై ప్రభావం చూపే అవకాశం కన్పిస్తున్నది. దీనికి తోడూ దేశంలో కరోనా బారినపడుతున్న ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ప్రస్తుత Coronavirus పరిస్థితులను గమనిస్తే... దేశం మళ్లీ లాక్‌డౌన్ లోకి వెళ్లే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ఇదిలావుండగా, భారత్ కరోనా (Coronavirus) బారినపడుతున్న కొత్త వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,71,202 కరోనా కేసులు (Corona cases) నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,71,22,164కి చేరింది. కరోనాతో మరో 314 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,86,066కి చేరింది. దీంతో ఇప్పటివరకు కరోనాను జయించిన వారి సంఖ్య 3,50,85721కి చేరింది. నిన్న కరోనా (Coronavirus) నుంచి 1,38,331 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 15,50,377 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.