హథ్రాస్‌ ఘటన : ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడితే .50 లక్షలు.. యూపీ డీజీపీ సంచలనం..

By AN TeluguFirst Published Oct 6, 2020, 1:37 PM IST
Highlights

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హ్రథాస్ ఘటనకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌ పోలీసుల వ్యవహారశైలి మరోసారి వివాదాస్పదంగా మారుతోంది. ఈ ఘటనలో ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి ప్రయత్నించారంటూ మరో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 19 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హ్రథాస్ ఘటనకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌ పోలీసుల వ్యవహారశైలి మరోసారి వివాదాస్పదంగా మారుతోంది. ఈ ఘటనలో ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి ప్రయత్నించారంటూ మరో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 19 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. 

ముఖ్యంగా సోషల్‌ మీడియా వేదికగా కొన్ని గ్రూపులు రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని యూపీ డీజీపీ ప్రశాంత్‌ కుమార్‌ చెప్పారు. అంటున్నారు. అంతేకాదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీడియా ముందు మాట్లాడితే రూ.50 లక్షలు ఇస్తామని బాధితురాలి కుటుంబ సభ్యులను ప్రలోభపెట్టారని ఆయన ఆరోపించారు.

 కొన్ని సంఘ విద్రోహ శక్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రపూరితంగా రాష్ట్రంలో సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని, ఇటువంటి వారిని ఉపేక్షించేది లేదన్నారు. ఈ కేసుకు సంబంధించి కొంతమందిపై ఇప్పటికే దేశ ద్రోహం కేసు నమోదు చేశామని డీజీపీ వివరించారు

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని,  రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను భంగపరిచేలా కుట్ర చేసి "సోషల్ మీడియాలో వైరల్" చేశారని యుపి పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. తన ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ఓర్వలేనివారే హథ్రాస్ ఘటనను అడ్డుపెట్టుకుని తన ప్రతిష్టను భగ్నం చేయాలని చూస్తున్నారని యోగి ఆదిత్యనాథ్ అన్న తరువాత ఈ కేసులు నమోదవ్వడం గమనార్హం. హథ్రాస్ ఘటన చుట్టూ కుట్ర ఉంది, నిజాలు వెలికితీసే పనిలో ఉన్నామని సీనియర్ పోలీసు అధికారి ప్రశాంత్ కుమార్ సోమవారం ఎఫ్‌ఐఆర్‌లను వివరిస్తూ చెప్పారు.

పొలం పనులు చేసుకుంటున్న 20 ఏళ్ల యువతిపై పెప్టెంబర్‌ 14న నలుగురు వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. తీవ్రంగా గాయపడిన యువతి రెండు వారాల పాటు మృత్యువుతో పోరాడి ఇటీవలే మరణించింది. ఆమె మృతదేహాన్ని తెల్లవారుజామున 2:30 గంటలకు పోలీసులు దహనం చేశారు. దీనిపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. 

click me!