అన్ లాక్ 5.0: సినిమా హాళ్లకు గ్రీన్ సిగ్నల్, ప్రైమరీ స్కుల్స్ మూతనే

By telugu teamFirst Published Sep 28, 2020, 8:31 AM IST
Highlights

అక్టోబర్ 1వ తేదీ నుంచి అన్ లాక్.5 ప్రక్రియ ప్రారంభం కానుంది. అన్ లాక్ 5.0లో కేంద్ర ప్రభుత్వం మరిన్ని సడలింపులు ప్రకటించే అవకాశం ఉంది. సినిమా హాళ్లకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది.

న్యూఢిల్లీ: నాలుగో దశ కరోనా వైరస్ కోవిడ్ -19 లాక్ డౌన్ సడలింపులు ఈ నెల 30వ తేదీన ముగుస్తున్నాయి. దీంతో అక్టోబర్ 1వ తేదీ నుంచి అన్ లాక్ 5.0 ప్రారంభమవుతుంది. అన్ లాక్ 5.0 మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం ఇంకా జారీ చేయాల్సి ఉంది. అయితే, ఈ కాలంలో మరిన్ని సడలింపులను కేంద్రం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవల ప్రధాని మోడీ కోవిడ్ ప్రభావం తీవ్రంగా ఉన్న ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. మైక్రో - కంటైన్మమెంట్ జోన్స్ ఏర్పాటుకు సిద్ధం కావాలని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఢిల్లీతో పాటు ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మోడీ వారానికి రెండు మూడు రోజులు లాక్ డౌన్స్ విధించడానికి స్వస్తి చెప్పాలని సూచించారు. 

ప్రజలు మరిన్ని కార్యకలాపాల్లో పాల్గొనడానికి వీలుగా లాక్ డౌన్ సడలింపులు ఉండవచ్చునని భావిస్తున్నారు. తమ అనుమతి తీసుకోకుండా రాష్ట్రాలు తమంత తాముగా లాక్ డౌన్లు విధించకూడదని అన్ లాక్ 4.0 మార్గదర్శకాలు జారీ చేసే సమయంలో హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. 

భౌతిక దూరం పాటిస్తూ మరిన్ని ఆర్థిక కార్యకలాపాలకు వెసులుబాటు కల్పిస్తూ కేంద్రం 5.0 లాక్ డౌన్ మార్గదర్శకాలను జారీ చేసే అవకాశం ఉంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి సినిమాహాళ్లను తెరవడానికి కేంద్రం అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. భౌతిక దూరం పాటించడానికి వీలుగా సిట్టింగ్ ఏర్పాట్లు ఉండే విధంగా చూస్తూ సినిమాహాళ్లకు పచ్చజెండా ఊపే అవకాశం ఉంది.

కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ తో పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బ తిన్నది. దీంతో పర్యాటక స్థలాలను సందర్శించడానికి ప్రజలను అనుమతించే అవకాశం ఉంది. 

దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 21వ తేదీన నుంచి 9 నుంచి 12 తరగతుల విద్యార్థులు విద్యాసంస్థలకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకున్నారు అది వచ్చే నెల కూడా కొనసాగుతుంది. అయితే, ప్రాథమిక విద్యాసంస్థలను మాత్రం మరిన్ని వారాల పాటు మూసి ఉంచవచ్చు. 

click me!