కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు.
న్యూఢిల్లీ: కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు.
ఇటీవల కాలంలో తనను కలిసినవారితో పాటు తనతో సమావేశాల్లో పాల్గొన్నవారంతా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. అంతేకాదు వారంతా కూడ హోం క్వారంటైన్ లోకి వెళ్లాలని కూడ ఆయన సూచించారు.
undefined
డాక్టర్ల సూచనల మేరకు తాను ఆసుపత్రిలో చేరినట్టుగా ఆయన ప్రకటించారు.
ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శ్వాసకోశ సమస్యలతో ఎయిమ్స్ లో చేరాడు. ఈ నెల 2వ తేదీన ఆయనకు కరోనా సోకిన విషయం తెలిసిందే.
మరో వైపు ఏపీ,తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదాల నేపథ్యంలో ఈ నెల 25వ తేదీన అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కేంద్ర జలవనరుల శాఖ నిర్ణయం తీసుకొంది.
ఈ సమావేశంలో తమ వాదనలను విన్పించేందుకు గాను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ తరుణంలో కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ కు కరోనా సోకడంతో అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా పడే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
వాస్తవానికి ఈ నెల 5వ తేదీన అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ తలపెట్టింది. అయితే అదే రోజున తెలంగాణ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసినందున అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఈ నెల 20వ తేదీ తర్వాత నిర్వహించాలని కేంద్ర జలవనరుల శాఖకు తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశాడు. దీంతో ఈ నెల 25వ తేదీకి అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేశారు. ప్రస్తుతం కేంద్ర మంత్రి షెకావత్ కు కరోనా రావడంతో మరోసారి అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా పడే అవకాశం లేకపోలేదు.