సాక్షాత్తు కేంద్రమంత్రి సోదరుడికి బెడ్ దొరక్కపోవడంతో ఆయన స్వయంగా రంగంలోకి దిగి అభ్యర్ధించాల్సి వచ్చింది. దీనిని బట్టి దేశంలో ఎలాంటి పరిస్ధితులు చోటు చేసుకుంటున్నాయో చెప్పవచ్చు.
దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు గణనీయంగా పెరుగుతుండటంతో.. ఆస్పత్రుల్లో బెడ్ల కొరత ఏర్పడుతోంది. దీంతో రోగులను వీల్ చైర్లపైనే కూర్చొబెట్టి ఆక్సిజన్ సిలిండర్ల సాయంతో చికిత్స అందిస్తున్నారు.
కొన్ని చోట్ల ఒకే బెడ్‌పై ఇద్దరిని వుంచి చికిత్స అందిస్తున్నారు. సాధ్యమైనంత వరకు రోగులందరికీ వైద్యం అందించేందుకు డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
undefined
అయినప్పటికీ అనేక ఆసుపత్రుల్లో కరోనా సోకిన వారు బెడ్‌లు లేక తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. సామాన్యులకే కాదు ఏకంగా ప్రముఖులకు, వారి కుటుంబాలకు సైతం ఇదే పరిస్థితి. కాగా, సాక్షాత్తు కేంద్రమంత్రి సోదరుడికి బెడ్ దొరక్కపోవడంతో ఆయన స్వయంగా రంగంలోకి దిగి అభ్యర్ధించాల్సి వచ్చింది. దీనిని బట్టి దేశంలో ఎలాంటి పరిస్ధితులు చోటు చేసుకుంటున్నాయో చెప్పవచ్చు.
Also Read:ఇండియాలో కరోనాతో రికార్డు స్థాయిలో మరణాలు: ఒక్క రోజులోనే 1501 మంది మృతి, డేంజర్ బెల్స్
కేంద్రమంతి వీకే సింగ్ ఘజియాబాద్ నియోజకవర్గంలో తన సోదరుడికి బెడ్‌ను కేటాయించాల్సిందిగా కోరారు. అయితే తన ట్వీట్ వైరల్ కావడంతో కేంద్రమంత్రి దానిని తొలగించారు. అంతేకాకుండా ఇది తన తమ్ముడి గురించి చేసిన విజ్ఞప్తి కాదని వీకే సింగ్ వెల్లడించారు.
ఈ మేరకు ట్వీటర్‌లో ఆయన చేసిన ట్వీట్ మన దేశంలో ప్రస్తుతం ఎలాంటి వాతావరణం వుందో చెప్పవచ్చు. దీన్ని చూసిన నెటిజన్లు ఒక కేంద్ర మంత్రి వైద్య సాయం కావాలని కోరడం బాధకరమని, దీన్ని బట్టి భారతదేశంలో దారుణ పరిస్థితుల్లో ఉన్నామని కామెంట్‌లు పెడుతున్నారు. ఇప్పటికైనా ప్రజలందరు మాస్క్‌ను ధరించి, కోవిడ్ నిబంధనలను పాటించాలని అలాగే టీకాను సైతం తీసుకోవాలని సూచిస్తున్నారు.