మోడీని, ఎన్డీయేని ఓడించడమంటే.. పిల్లల ఆటకాదు : కేంద్రమంత్రి అథవాలే వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Apr 30, 2022, 02:29 PM IST
మోడీని, ఎన్డీయేని ఓడించడమంటే.. పిల్లల ఆటకాదు : కేంద్రమంత్రి అథవాలే వ్యాఖ్యలు

సారాంశం

మోడీ, ఎన్డీయేని ఓడించడం పిల్లల ఆట కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి రాందాస్ అథవాలే.  తాను తెలంగాణకి సపోర్ట్‌గా ఇక్కడికి వచ్చానని.. కేసీఆర్ పోరాటం చేశారని, ఆయనకు తనకు స్నేహితుడని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.  

వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే కేంద్రమంత్రి రాందాస్ అథవాలే (ramdas athawale) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఎందరు నేతలు రావాలనుకుంటున్నారో రండి అంటూ వ్యాఖ్యానించారు. ఉద్ధవ్ థాక్రేని సీఎం కేసీఆర్ కలిశారని... దీనిపై అభ్యంతరం లేదని కేంద్రమంత్రి అన్నారు. ఫ్రంట్‌లు ఎవరైనా ఏర్పాటు చేయొచ్చని.. ఎన్డీయేని, మోడీని ఓడించడం పిల్లల ఆటకాదని అథవాలే అన్నారు. తాను తెలంగాణకి సపోర్ట్‌గా ఇక్కడికి వచ్చానని.. కేసీఆర్ పోరాటం చేశారని, ఆయనకు తనకు స్నేహితుడని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని రాందాస్ అథవాలే డిమాండ్ చేశారు. దళితులకు ఐదెకరాల భూమి ఇవ్వాలని ఆయన కోరారు.

ఇకపోతే.. కొద్దిరోజుల క్రితం కూడా రాందాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే (NDA) కూటమిలోకి వైసీపీ  (ysrcp) చేరాలని సూచించారు. కేంద్రంలో భాగస్వామ్యంతోనే ఏపీ అభివృద్ధి అని అథవాలే వ్యాఖ్యానించారు. ప్రాజెక్ట్‌లు, రహదారులు పూర్తి చేసుకోవచ్చని... పరిశ్రమల ప్రైవేటీకరణ కాంగ్రెస్ (congress) హయాంలో కూడా జరిగిందని కేంద్రమంత్రి గుర్తుచేశారు. మూడు రాజధానుల అంశం కేంద్రం పరిధిలో లేదని రామ్‌దాస్ అథవాలే స్పష్టం చేశారు. 

అంతకుముందు.. 2004లోనే సోనియాగాంధీ (sonia gandhi) ప్రధాని పదవి చేపట్టి ఉండాల్సిందని రాందాస్ వ్యాఖ్యానించి దుమారం రేపారు. ఆమె విదేశీ మూలాల వాదనకు అర్థం లేదని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా యూఎస్‌ వైఎస్‌ ప్రెసిడెంట్‌ (us vice president) కమల హ్యారిస్‌ను (kamala harris) రామ్‌దాస్ ప్రస్తావించారు. యూపీఏ అధికారంలోకి వచ్చినప్పుడు.. సోనియాగాంధీ ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టాలని తాను ప్రతిపాదించినట్టు ఆయన గుర్తుచేశారు.

ఇండో అమెరికన్‌ మూలాలున్న కమలా హ్యారిస్ అగ్రరాజ్య ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పుడు.. సోనియాగాంధీ మన దేశానికి ఎందుకు ప్రధాని కాకూడదని ప్రశ్నించారు. ఆమె రాజీవ్‌గాంధీ (rajeev gandhi) సతీమణి, లోక్‌సభ సభ్యురాలని అన్నారు. అలాగే 2004లో మన్మోహన్‌సింగ్‌ను (manmohan singh) కాకుండా శరద్‌పవార్‌ను (sharad pawar) ప్రధానిని చేస్తే బావుండేదని రామ్‌దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే పంజాబ్ ఎన్నికల వేళ.. మాజీ సీఎం అమరీందర్ సింగ్ (captain amrinder singh) ఎన్డీయేలోకి రావాలంటూ అథవాలె ఆహ్వానించి సంచలనం రేపారు. కాంగ్రెస్ పార్టీ అమరీందర్‌ను అవమానించిందని, అలాంటి పార్టీలో ఉండాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు. ఎన్డీయేలో ప్రతి ఒక్కరికి సమాన గౌరవం ఉంటుందన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?