ప్రతి ఒక్కరికి మేలు చేసే బడ్జెట్: కేంద్ర బడ్జెట్ 2023పై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్

By narsimha lode  |  First Published Feb 1, 2023, 5:13 PM IST

ప్రపంచ వ్యాప్తంగా  పలు  దేశాలు  ఆర్ధికంగా  ఇబ్బందులు పడుతున్నా ఇండియాను ఆర్ధికంగా బలోపేతం చేసేలా   మోడీ ముందుకు నడుపుతున్నారని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు.  
 


న్యూఢిల్లీ: ప్రపంచంలోనే కీలకమైన ఆర్ధిక శక్తిగా  ఎదుగుతున్న  భారత్   కోసం  కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్   కీలకమైన బడ్జెట్ ను అందించారని   కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్  చెప్పారు. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన  కేంద్ర బడ్జెట్  పై  కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్  బుధవారం నాడు స్పందించారు.  ప్రతి ఒక్కరికీ  ఈ బడ్జెట్  ద్వారా  ప్రయోజనం  కలుగుతుందని  కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు.  డిజిటలైజేషన్, కొత్త నగరాలు, యువకులకు నైపుణ్యాలపై శిక్షణ, మధ్యతరగతి వర్గాల  ప్రజలకు  పన్ను తగ్గింపులకు సంబంధించి  బడ్జెట్  2023 నిర్ధారిస్తుందన్నారు.  

కరోనా,  యూరోపియన్ యుద్ధం కారణంగా   ప్రపంచంలో  పలు దేశాలు  కోలుకోవడానికి కష్టపడుతున్నట్టుగా  కేంద్ర మంత్రి గుర్తు  చేశారు.  కానీ  ప్రధాని నరేంద్ర మోడీ   నేతృత్వంలో  ఇండియా   ప్రపంచంలో  బలమైన ఆర్ధిక వ్యవస్థగా  రూపుదిద్దుకుంటుందని  కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్  తెలిపారు.  దేశంలోని  మధ్య తరగతి  ప్రజలపై  పన్నులను తగ్గించడం, రైతులు, ఎంఎస్ఎంఈ ల కోసం  బడ్జెట్  లో  చేసిన ప్రతిపాదనలను  కేంద్ర మంత్రి ప్రశంసించారు. 

Latest Videos

undefined

దేశాన్ని  బలమైన ఆర్ధిక వ్యవస్థ వైపునకు తీసుకెళ్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్  కు  కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ పార్లమెంట్ లో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్  బడ్జెట్  ను ప్రవేశ పెట్టారు.  ఈ బడ్జెట్  అన్ని రకాల ప్రజలకు  ప్రయోజనం చేకూరుస్తుందని  ప్రధాని నరేంద్ర మోడీ  చెప్పారు.  

 

click me!