ఈ ఏడాది అమెజాన్‌లో 8000 జాబ్ ఓపెనింగ్స్.. హైదరాబాద్ సహా 35 నగరాల్లో రిక్రూట్‌మెంట్

Published : Sep 02, 2021, 08:08 PM IST
ఈ ఏడాది అమెజాన్‌లో 8000 జాబ్ ఓపెనింగ్స్.. హైదరాబాద్ సహా 35 నగరాల్లో రిక్రూట్‌మెంట్

సారాంశం

అమెజాన్ సంస్థ ఈ ఏడాది మనదేశంలో కనీసం 8000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపింది. 2025 వరకు 20 లక్షల జాబ్ ఓపెనింగ్స్ లక్ష్యంగా పెట్టుకున్న ఈ సంస్థ ఇప్పటికి పది లక్షల ఉద్యోగాలను భర్తీ చేసినట్టు వివరించింది. ఈ ఏడాది హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 35 నగరాల్లో రిక్రూట్‌మెంట్లు ఉంటాయని పేర్కొంది.

న్యూఢిల్లీ: అమెజాన్ సంస్థ దేశంలో కనీసం 8000 ఉద్యోగాలను భర్తీ చేయాలని భావిస్తున్నది. ఈ ఏడాదిలో దేశంలో హైదరాబాద్ సహా  35 నగరాల్లో 8000లకుపైగా ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటామని ఆ సంస్థ టాప్ అధికారి ఒకరు వెల్లడించారు. కార్పొరేట్, టెక్నాలజీ, కస్టమర్ సర్వీస్ అండ్ ఆపరేషన్ రోల్స్‌లో ప్రధానంగా రిక్రూట్‌మెంట్లు ఉంటాయని వివరించారు.

‘అమెజాన్‌లో ఈ ఏడాది దేశవ్యాప్తంగా 35 నగరాల్లో 8000లకుపైగా జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయి. ఇందులో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, గుర్గావ్, ముంబయి, కోల్‌కతా, నోయిడా, అమృత్‌సర్, అహ్మదాబాద్, భోపాల్, కొయంబతూర్, జైపూర్, కాన్‌పూర్, లూధియానా, పూణె, సూరత్‌లు సహా పలునగరాల్లో రిక్రూట్‌మెంట్లు ఉంటాయి. కార్పొరేట్, టెక్నాలజీ, కస్టమర్ సర్వీసె అండ్ ఆపరేషన్ రోల్స్‌లలో ఈ ఉద్యోగావకాశాలు ఉంటాయి’ అని అమెజాన్ హెచ్‌ఆర్ లీడర్ దీప్తి వర్మ వివరించారు. వీటితోపాటు మెషిన్ లెర్నింగ్, అప్లైడ్ సైన్సెస్ వంటి విభాగాల్లో సహా హెచ్ఆర్, ఫైనాన్స్, లీగల్ శాఖల్లోనూ ఉద్యోగులను నియమించుకోనున్నట్టు తెలిపారు.

2025కల్లా దేశంలో 20 లక్షల ఉద్యోగాల(ప్రత్యక్ష, పరోక్ష)ను నియమించుకోవాలన్నది కంపెనీ లక్ష్యమని, ఇందులో ఇప్పటికే పది లక్షల ఉద్యోగాలు (డైరెక్ట్, ఇన్‌డైరెక్ట్) రిక్రూట్ చేసుకున్నట్టు ఆమె వివరించారు. కరోనా మహమ్మారి కాలంలోనూ అమెజాన్ మూడు లక్షల ఉద్యోగులను నియమించుకుందని తెలిపారు. నియామక ప్రక్రియ అంతా కూడా వర్చువల్‌గానే నిర్వహించినట్టు పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?