కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్

Published : Sep 17, 2020, 07:57 AM IST
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్

సారాంశం

కరోనా లక్షణాలు కనిపించడంతో తాను టెస్టు చేయించుకున్నానని.. దీంతో.. కోవిడ్ పాజిటివ్ గా తేలిందని నితిన్ గడ్కరీ స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. తాను సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నట్లు ఆయన ప్రకటించారు.


 కరోనా మహమ్మారి దేశంలో విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే దేశంలో కరోనా కేసులు 50లక్షలు దాటేశాయి. కాగా.. సామాన్యులు, సెలబ్రెటీలు అనే తేడా లేకుండా.. అందరినీ ఈ మహమ్మారి సోకేస్తోంది. తాజాగా.. కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్ అని తేలింది. కరోనా లక్షణాలు కనిపించడంతో తాను టెస్టు చేయించుకున్నానని.. దీంతో.. కోవిడ్ పాజిటివ్ గా తేలిందని నితిన్ గడ్కరీ స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. తాను సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నట్లు ఆయన ప్రకటించారు.

‘‘నిన్న నాకు కాస్త అనారోగ్యంగా ఉంటే వైద్యుడిని సంప్రదించాను. అనంతరం కోవిడ్-19 టెస్ట్ చేసుకోగా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నాను. వైద్యుల సలహా మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఇప్పుడు సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నాను. నాకు సన్నిహితంగా మెదిలిన వారు జాగ్రత్తగా ఉండాలని విజ్ణప్తి చేస్తున్నాను. జాగ్రత్తగా ఉండండి’’ అని తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో నితిన్ గడ్కరీ రాసుకొచ్చారు.

PREV
click me!

Recommended Stories

Government Jobs : రూ.78,800 శాలరీతో 173 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
EPFO కొత్త రూల్.. ఇకపై గూగుల్ పే, ఫోన్ పే ద్వారా పీఎఫ్ డబ్బులు