
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఢిల్లీలోని నితిన్ గడ్కరీ నివాసానికి ఫోన్ చేసిన అగంతకులు చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డారు. సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకున్నట్టుగా చెబుతున్నారు. ఇందుకు సంబంధించి నితిన్ గడ్కరీ సిబ్బంది ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించినట్టుగా తెలుస్తోంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నివాసానికి వచ్చిన హత్య బెదిరింపు కాల్‌కు సంబంధించిన సమాచారాన్ని ఆయన సిబ్బంది తమకు అందించారని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.
ఇక, ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ధృవీకరిస్తున్నట్టుగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అదే విధంగా విచారణ జరుపుతున్నట్టుగా ఆ వర్గాలు పేర్కొన్నాయి.