చిన్నమ్మ మృతి... కంటతడి పెట్టిన కిషన్ రెడ్డి

Published : Aug 07, 2019, 07:40 AM IST
చిన్నమ్మ మృతి... కంటతడి పెట్టిన కిషన్ రెడ్డి

సారాంశం

 ఆమె  పార్థీవదేహాన్ని చూసి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కంటతడిపెట్టారు. సుష్మాస్వరాజ్‌ ఇక లేరనే వాస్తవాన్ని జీర్ణించుకోలేపోతున్నట్లు ఉద్వేగానికి గురయ్యారు. 

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా... ఆమె  పార్థీవదేహాన్ని చూసి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కంటతడిపెట్టారు. సుష్మాస్వరాజ్‌ ఇక లేరనే వాస్తవాన్ని జీర్ణించుకోలేపోతున్నట్లు ఉద్వేగానికి గురయ్యారు. 

‘సుష్మాజీ నాకే కాదు.. యావత్తు తెలంగాణకు చిన్నమ్మే. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించి రాష్ట్రం వచ్చేలా చేసిన ఆమె కృషిని ఎన్నటికీ మరువలేము. ప్రజా సమస్యలపై ఆమె స్పందించే తీరు మాలాంటి వారికి స్ఫూర్తి. సుష్మాస్వరాజ్‌ ఆత్మకు శాంతి కలగాలని కోరుకొంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.  

PREV
click me!

Recommended Stories

Interesting Facts : మనం ఏడ్చినప్పుడు ముక్కు ఎందుకు కారుతుంది..?
UPSC Interview Questions : గోరింటాకు పెట్టుకుంటే చేతులు ఎర్రగానే ఎందుకు మారతాయి..?