విద్యార్ధి నేత నుండి విదేశాంగ మంత్రిగా: సుష్మా స్వరాజ్ ప్రస్థానం

By narsimha lodeFirst Published Aug 7, 2019, 1:12 AM IST
Highlights

ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా రాజకీయాల్లోకి వచ్చిన సుష్మా స్వరాజ్ విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశారు చిన్న వయస్సులోనే రాష్ట్ర మంత్రిగా పనిచేసి రికార్డు సృష్టించారు. 

న్యూఢిల్లీ:మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ విద్యార్ధి నాయకురాలి నుండి విదేశాంగ శాఖ మంత్రిగా ఎదిగారు. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని నిరసిస్తూ ఆమె రాజకీయాల్లో ప్రవేశించారు.

1952 ఫిబ్రవరి 14న హర్యానా రాష్ట్రంలోని అంబాలాలో సుష్మా స్వరాజ్ పుట్టారు. చంఢీగడ్ లా యూనివర్శిటీ నుండి ఆమె లా పట్టా పొందారు. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని నిరసిస్తూ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

విద్యార్ధిగా ఉన్న సమయంలో ఏబీవీపీలో ఆమె చురుకుగా పనిచేశారు. ఆ తర్వాత ఆమె క్రియాశీలక రాజకీయాల్లోకి వెళ్లారు.1977లో జనతా పార్టీ తరపున హర్యానా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1987లో బీజేపీ తరపున ఆమె విజయం సాధించారు. 

25 ఏళ్ల వయస్సులోనే ఆమె దేవీలాల్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు.1977 నుండి 1979 వరకు ఆమె దేవీలాల్ ప్రభుత్వంలో ఉపాధి కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. 1984లో ఆమె బీజేపీలో చేరారు.1987 నుండి 1990 వరకు దేవీలాల్ నేతృత్వంలోని లోక్ దళ్-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో విద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. 

1990లో సుష్మా స్వరాజ్ రాజ్యసభకు ఎన్నికై జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. 1980,1984,1989లలో కార్నాల్ లో‌క్ సభ  స్థానం నుండి ఆమె పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 

1996 లో దక్షిణ ఢిల్లీ నుండి ఆమె పార్లమెంట్ లో అడుగుపెట్టారు. 1998లో కూడ ఇదే స్థానం నుండి ఆమె విజయం సాధించారు. 1998లో ఢిల్లీ సీఎంగా ఆమె పనిచేశారు.

2009 నుండి 2014వరకు లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా సుష్మా స్వరాజ్ వ్యవహరించారు. 2014లో మోడీ కేబినెట్ లో ఆమె విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఐదేళ్ల పాటు ఈ పదవిలో ఆమె కొనసాగారు.
 

click me!