నా రాజకీయ జీవితాన్ని దెబ్బతీసే కుట్రలో భాగమే రాసలీలల సీడీ: మాజీ మంత్రి రమేష్

Published : Mar 09, 2021, 03:20 PM IST
నా రాజకీయ జీవితాన్ని దెబ్బతీసే కుట్రలో భాగమే రాసలీలల సీడీ: మాజీ మంత్రి రమేష్

సారాంశం

తనపై రాజకీయ కుట్రలో భాగంగానే  ఆ సీడీ బయటకు వచ్చిందని మాజీ మంత్రి రమేష్ జార్ఖిహోళి ఆరోపించారు.


బెంగుళూరు: తనపై రాజకీయ కుట్రలో భాగంగానే  ఆ సీడీ బయటకు వచ్చిందని మాజీ మంత్రి రమేష్ జార్ఖిహోళి ఆరోపించారు.

మంగళవారం నాడు ఆయన బెంగుళూరులోని తన నివాసంలో ఆయన  మీడియాతో మాట్లాడారు. ఆ వీడియో సీడీ నకిలీదని ఆయన చెప్పారు. తనకు వ్యతిరేకంగా కుట్ర చేశారన్నారు.

రాసలీలల వ్యవహారంలో తాను ఉన్నానని విడుదల చేసిన సీడీలో నిజం లేదన్నారు. తాను అమాయకుడిగా ఆయన పేర్కొన్నారు. ఈ సీడీల వ్యవహారం తన దృష్టికి నాలుగు మాసాల క్రితమే వచ్చిందన్నారు.

అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని అప్పుడే తన సోదరుడికి వివరించినట్టుగా ఆయన తెలిపారు. ఈ విషయంలో న్యాయపరమైన సహకారం తీసుకొంటానని ఆయన చెప్పారు. 

మంత్రి పదవికి రాజీనామా చేయడం తన స్వంత నిర్ణయమేనని ఆయన వివరించారు. తనను రాజీనామా చేయాలని సీఎం కానీ, పార్టీ కానీ కోరలేదని ఆయన గుర్తు చేశారు.

ఈ ఫేక్ సీడీలను తయారు చేయడానికి రూ. 20 కోట్లు ఖర్చు చేశారని ఆయన చెప్పారు. బెంగుళూరులోని యశ్వంత్ పూర్, హులిమావు అనే రెండు చోట్ల ఈ కుట్ర జరిగిందని మాజీ మంత్రి చెప్పారు. 

ఈ సీడీలో ఉన్న అమ్మాయికి రూ. 5 కోట్లతో పాటు విదేశాలలో రెండు ఫ్టాట్లు ఇచ్చారని తనకు సమాచారం ఉందని ఆయన తెలిపారు.ఈ సీడీ తన రాజకీయ జీవితాన్ని దెబ్బతీసేలా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ రాసలీలల సీడీ వెలుగు చూడడంతో ఈ నెల 3వ తేదీన రమేష్ తన మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.


 

PREV
click me!

Recommended Stories

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కర్ణాటక హైకోర్టు స్టే
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు