కల నెరవేరింది.. నా రాజకీయ జీవితం ముగియనుంది: గిరిరాజ్‌సింగ్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Sep 24, 2019, 5:04 PM IST
Highlights

కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ రెండోసారి పదవీకాలం పూర్తయ్యే నాటికి తాను రాజకీయాల్లోంచి తప్పుకునే అవకాశం ఉందంటూ వ్యాఖ్యానించారు.

కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ రెండోసారి పదవీకాలం పూర్తయ్యే నాటికి తాను రాజకీయాల్లోంచి తప్పుకునే అవకాశం ఉందంటూ వ్యాఖ్యానించారు.

మంగళవారం పాట్నాలో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న చౌహాన్.. తన రాజకీయ జీవితం చివరి దశకు చేరుకుందని, తాను అధికారం కోసమో, పదవులు అనుభవించడానికో ప్రజా జీవితంలోకి రాలేదన్నారు.

కాశ్మీర్‌తో కూడిన జాతీయవాదం నా చిరకాల స్వప్నమని.. దీని కోసమే బీజేపీ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ తన జీవితాన్ని ముగించుకున్నారని గిరిరాజ్ సింగ్ గుర్తు చేసుకున్నారు.

ఇప్పుడు నరేంద్రమోడీ వంటి వ్యక్తి ప్రధానిగా ఉండటం జాతి అదృష్టమని.. జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో తన చిరకాల వాంఛ నెరవేరిందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.

అయితే వచ్చే ఏడాది బీహార్‌లో శాసనసభ ఎన్నికలు జరగనుండటంతో ముఖ్యమంత్రి అభ్యర్ధిత్వం ఆశిస్తున్నారా అన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు సమాధానంగా గిరిరాజ్ పైవిధంగా స్పందించారు. 
 
click me!